English | Telugu
ఆ మచ్చలు నా అందాన్ని పోగొట్టాయి!
Updated : Feb 21, 2023
చికెన్ పాక్స్ తో సీనియర్ నటి కస్తూరి ఇబ్బంది పడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కస్తూరి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా తాను వికృతంగా మారానని శరీరం మొత్తం ఆ మచ్చలు పడ్డాయని కానీ కళ్ళ మీద మాత్రం రాలేదని సంతోషంతో చెప్పింది. ఇలాంటి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పింది. ఈ మచ్చలన్నీ త్వరలో తగ్గిపోయి స్కిన్ అంతా మాములుగా ఎప్పటిలాగే వస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది.
ఇక నెటిజన్స్ కస్తూరి పిక్స్ చూసి చాలా కామెంట్స్ చేశారు "మీ అందమైన ముఖంలో ఈ మచ్చలు చూడడానికి అస్సలు బాలేదు. మీరు నాచురల్ గా కూడా చాలా అందంగా ఉన్నారు. మీ కళ్ళల్లో ఎప్పుడూ ఏదో అందమే కనిపిస్తుంది..మీరు ముసలి వాళ్లవుతున్నా మీలో ఆ అందం, ఆ యవ్వనం అస్సలు తగ్గలేదు...మేడం అస్సలు బాధ పడకండి" అంటూ కస్తూరికి ధైర్యం చెప్తున్నారు.
తెలుగు మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బుల్లితెరపై కూడా దూసుకుపోతోంది. కొంతమంది ఇలా ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలం అయ్యాకా తెరమరుగైపోతారు.
కానీ ఇంకొంతమంది మాత్రం అలా దూసుకుపోతూ ఉంటారు. అందులో కస్తూరి ఒకరు. సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా ఆమె హవా కొనసాగుతోంది.