English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్.. దీపకి సపోర్ట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 1'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -528 లో.....జ్యోత్స్న కాలు అడ్డు పెట్టడంతో దీప పడిపోతుంటే.. సుమిత్ర పట్టుకుంటుంది. అయ్యో జాగ్రత్త దీప అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న పైకి వెళ్తుంది. రక్తసంబంధం అంటే ఇదేనేమోనని జ్యోత్స్న అనుకుంటుంది. ఒకసారి మా అమ్మని దీప కాపాడింది. ఈసారి దీపని మా అమ్మ కాపాడింది. ఇప్పుడు తన మనవరాలిని కాపాడుకుందని జ్యోత్స్న కోపంగా ఉంటుంది.

అప్పుడే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. మనసులో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లున్నావని అడుగుతాడు. ఎందుకని జ్యోత్స్న అడుగుతుంది. ఇందాక నా భార్య ఎవరైనా కాలు పెడితే పడిపోబోయిందా లేక నార్మల్ గానే పడిపోబోయిందా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. నాకేం తెలుసని జ్యోత్స్న అంటుంది. ఒకవేళ ఇంటెన్షన్ గా నా బిడ్డకి ఏదైనా చెయ్యాలని చూస్తే ఊరుకోనని కార్తీక్ ఇండైరెక్ట్ గా జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు కాంచన దగ్గరికి శ్రీధర్ వస్తాడు.

నీతో రెండు విషయాలు తెల్చుకోవాలని వచ్చానని అంటాడు. అందరు నన్ను క్షమించారు.. మరి నువ్వు ఎందుకు క్షమించడం లేదని శ్రీధర్ అడుగుతాడు. ఎప్పటికి క్షమించను మిమ్మల్ని భర్తగా ఒప్పుకోనని కాంచన అంటుంది. ఇక వెళ్లిపోండి అని కాంచన అంటుంది. ఇంకొక విషయం అడగాలి. అది అందరు ఉన్నప్పుడు అడుగుతాను.. వాళ్ళు రానివ్వు అని శ్రీధర్ అంటాడు.


మరొకవైపు ఆ కాలు అడ్డు పెట్టింది జ్యోత్స్న అని మాట్లాడుకుంటారు. చిన్నగా వార్నింగ్ అయితే ఇచ్చానులే అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. దీప నువ్వు నార్మల్ గానే పడ్డావా లేక ఎవరైనా ఏదైనా చేసారా అని శివన్నారాయణ అడుగుతాడు. అదేం లేదు నార్మల్ గానే పడబోయానని దీప చెప్తుంది. మరొకవైపు మీరు ఇక వెళ్ళండి వాళ్ళు వచ్చేవరకు లేట్ అవుతుందని శ్రీధర్ ని కాంచన వెళ్ళమంటుంది. అప్పుడే కావేరి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.