English | Telugu

Karthika Deepam2 : ప్రాణాపాయ స్థితిలో దీప.. బ్లడ్ కోసం సుమిత్ర కాళ్ళ మీద పడ్డ కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -351 లో... పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను గౌతమ్ దగ్గరికి వెళ్లానని నీకెలా తెలుసు.. నన్ను ఫాలో చేస్తున్నావా అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు నేను పెంచిన మొక్కవి నీ బాధ్యత నాది అని పారిజాతం అంటుంది. నాకు గౌతమ్ అంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు ఇరికించావ్.. నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అంటుంది.

దశరథ్ ని కాల్చింది దీప కాదు కదా అని పారిజాతం అనగానే.. దీపనే చేసింది అని జ్యోత్స్న అంటుంది. దీప కాకుండా వేరే వాళ్ళు అయితే అని పారిజాతం అనగానే.. అయితే వాళ్ళు దొరికే ఛాన్స్ లేదని జ్యోత్స్న పొరపాటుగా నోరుజారుతుంది. అంటే దొరకరు అంటే నీకు తెలుసా అని పారిజాతం అడుగుతుంది. నన్ను ఇర్రిటేట్ చెయ్యకని జ్యోత్స్న అంటుంది. అప్పుడే శివన్నారాయణ గట్టిగా పిలుస్తాడు. దాంతో పారిజాతం, జ్యోత్స్న కిందకి వస్తారు‌. వాళ్ళు వచ్చేసరికి పోలీసులు ఉంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది.

దీపని ఎవరో కత్తితో పొడిచారంట.. అది నువ్వే చేసావని కార్తీక్ డౌట్ పడుతున్నాడంట.. అందుకే వచ్చారని శివన్నారాయణ అంటాడు. నేను చెయ్యలేదని జ్యోత్స్న అంటుంది. ఇంకెప్పుడు ఆధారాలు లేకుండా రాకని పోలీసులకి చెప్తుంది సుమిత్ర. మరొకవైపు డాక్టర్ బయటకు వచ్చి అర్జెంట్ గా బ్లడ్ కావాలని చెప్తుంది. నేను ఇస్తానని కార్తీక్ అనగానే.. మొన్నే ఇచ్చావ్.. నువ్వు వద్దని డాక్టర్ చెప్తుంది. దాంతో కార్తీక్ సుమిత్ర దగ్గరికి వెళ్లి అత్త దీపకి బ్లడ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఇవ్వనని సుమిత్ర అంటుంది. దాంతో తన కాళ్ళపై పడి అడుగుతాడు కార్తీక్. అయినా నేను ఇవ్వను.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళమని సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. దాంతో కార్తీక్ బాధగా వెనక్కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.