English | Telugu

Karthika Deepam2 : హాస్పిటల్ ‌లో దీప.. ఇంటికి రమ్మని ఒప్పించిన గొప్పింటొళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఇది నవ వసంతం... ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -11 లో.. సుమిత్ర గుడిలో అన్నదానం చేస్తుంటే అప్పుడే ఆకలిగా ఉన్న దీప, శౌర్యలు అన్నదానం దగ్గరికి వస్తారు. సుమిత్ర వాళ్ళని దగ్గరికి పిలుచుకొని ప్రేమగా మాట్లాడుతూ భోజనం వడ్డిస్తుంది. వాళ్ళ పేర్లు కనుక్కొని ప్రేమగా మాట్లాడుతుంది. నీ పేరేంటని సుమిత్రని శౌర్య అడుగుతుంది. నా పేరు అమ్మమ్మ అంటూ సుమిత్ర జోక్ చేస్తుంది. ఇక నుండి నన్ను అమ్మమ్మ అని పిలువు అని శౌర్యకి చెప్తుంది.

ఆ తర్వాత బంటు తనని సుమిత్ర కొట్టిందన్న కోపంతో ఒక రౌడీని సుమిత్ర దగ్గరికి పంపిస్తాడు. సుమిత్ర తల మీద కొట్టడానికి వచ్చిన రౌడీని దీప చూసి సుమిత్రని తప్పించగా తనకి దెబ్బ తగులుతుంది. తనని కాపాడి తనకి గాయం చేసుకుందని సుమిత్ర బాధపడుతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేసావంటు బంటుని పారిజాతం కొడుతుంది. నేను ఇది చేశానని తెలిస్తే మీ గురించి కూడా తెలుస్తుందని పారిజాతాన్ని బంటు భయపెడతాడు. ఆ తర్వాత సుమిత్ర భర్త దశరథ్ కి విషయం తెలిసి కంగారుపడతాడు. ఆ విషయం తెలిసి జ్యోత్స్న ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటే.. సుమిత్ర బానే ఉంది. తనని కాపాడబోయే ఎవరో అమ్మాయికి గాయం అయిందట అని చెప్తాడు. వాడు ఎవడో వదిలి పెట్టొద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనగానే పారిజాతం టెన్షన్ పడుతుంది.

ఆ తర్వాత దీపని సుమిత్ర హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తుంది. అప్పుడే దశరథ్, జ్యోత్స్నలు హాస్పిటల్ కి వస్తారు. మా అమ్మని కాపాడారు. చాలా థాంక్స్ అంటూ జ్యోత్స్న చెప్తుంది. అప్పుడే పోలీసులు వస్తారు. మీరు అతని గుర్తుపడతారా అని దీపని లేడి పోలీస్ అడుగుతుంది. గుర్తుపడుతానని దీప చెప్పగానే.. మీరు మాకు అందుబాటులో ఉండాలని చెప్తారు. మా ఇంట్లో ఉంటుంది ఎక్కడ రౌడీని గుర్తు పడుతుందోనని తనపై కూడా అటాక్ చేస్తారు. ఇప్పుడు దీపని కాపాడుకునే బాధ్యత మాకుందని సుమిత్ర, దశరథ్ లు అంటారు. ఇక నుండి నేను నీ చెల్లిని అంటు జ్యోత్స్న అంటుంది. చివరకి శౌర్య, దీపలని వాళ్ళింట్లో ఉండేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.