English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యని కాలుకిందపెట్టకుండా చూసుకుంటున్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -65 లో.. రామలక్ష్మి డ్రైవ్ ఇస్తూ ఇంటికి రావడం చూసిన పెద్దాయన.. ఏంటిరా నువ్వు ఉండగా నీ భార్యతో డ్రైవ్ చేయిస్తున్నావ్? డ్రైవర్ అనుకున్నావా తను ఈ ఇంటి కోడలు.. నీ భార్య అని పెద్దాయన అంటాడు. మీరు దగ్గరికి జరగండి ఒక ఫోటో తీసుకుంటాను.. అప్పుడప్పుడు మీరు జంటగా ఉన్న ఫోటో చూస్తూ మురిసిపోతానంటు పెద్దాయన అని ఇద్దరిని ఒక ఫోటో తీస్తాడు. ఎంత బాగున్నారో.. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని వారిద్దరితో పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి గదిలో కూర్చొని సిరి అన్న మాటలు, ధన అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. మళ్ళీ దేని గురించి బాధపడుతున్నావని అడుగుతాడు. అసలు నా కళ్ల ముందు జరిగేదంతా కల లాగే ఉందంటూ బాధపడుతుంటే.. సీతాకాంత్ ఆమె బాధను పోగొట్టి కూల్ చేస్తాడు.. మీరు నాకు ప్రొద్దున కాఫీ తీసుకొని వచ్చారు కదా.. నేను ఇప్పుడు మీకు తీసుకొని వస్తానని రామలక్ష్మి అనగానే‌.. నీ చేతి కాఫీ తాగే అదృష్టం నాకు ఇసున్నావన్న మాట అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి కిచెన్ లోకి వెళ్తుంది. ఎంత పెద్దగా వుంది కిచెన్ అని ఆశ్చర్యంగా చూస్తుంది. పని మనిషిని ఎక్కడ ఏం ఉన్నాయో కనుక్కొని కాఫీ చేసుకొని తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే రామలక్ష్మి కిందపడబోతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి పట్టుకుంటాడు. ఎత్తుకొని వెళ్లి హాల్లో కూర్చొపెడతాడు. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. కాలు బెనికిందని సీతాకాంత్ హడావిడి చేస్తాడు. స్వయంగా సీతాకాంత్ రామలక్ష్మి కాలుకి స్ప్రే కొడుతూ చిన్నపాటి చికిత్సలగా చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మిని సిరి, సీతాకాంత్ కలిసి గదిలోకి తీసుకొని వెళ్తారు.

మరోవైపు శ్రీలత, సందీప్ మాట్లాడుకుంటారు. ఏంటి వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకున్నారనిపిస్తుందని శ్రీలతతో సందీప్ అనగానే.. చేసుకున్నది లేనిది రేపు తెలుస్తుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. ఎలా ఉందని అడుగుతాడు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారని రామలక్ష్మి అడుగుతుంది. నా మనసులో నీపై ప్రేమని ఎలా చెప్పాలని సీతాకాంత్ తన మనసులో అనుకుంటాడు. అంటే మీ తమ్ముడు పెళ్లి ఉంది కదా అందుకోసమని సీతాకాంత్ కవర్ చేస్తాడు. మా కోసం మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు.. మిమ్మల్ని ఒక్కటి చేయాలని సిరి అనుకుంటుంది. అప్పుడే సిరి టిఫిన్ తీసుకొని వెళ్లి.. వదినకి తినిపించు అన్నయ్య అని సీతాకాంత్ తో అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.