English | Telugu

రుద్రాణికి కార్తీక్ ఎవ‌రో తెలిసిపోతుందా?

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతున్న ఈ సీరియ‌ల్ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన అంకానికి చేరింది. కార్తీక్‌, దీప‌ల‌ని వెతుక్కుంటూ ఆనంద‌రావు,సౌంద‌ర్య తాటికొండ లోని ప్ర‌కృతి వైద్య‌శాల‌లో చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డే వుంటూ కార్తిక్‌, దీప‌ల గురించి సౌంద‌ర్య ఆరాతీస్తూ వుంటుంది. అయితే వారు తాటికొండ‌లోనే వున్నార‌ని ఆల‌స్యంగా తెలుసుకుని షాక్ కు గుర‌వుతుంది. ఈ బుధ‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం.

మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో రుద్రాణి చెంప చెల్లుమనిపించింది ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఆశ్ర‌మానికి వ‌చ్చిన దీప అక్క‌డ సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల‌ని చాటుగా చూసి షాక్ కు గుర‌వుతుంది. అక్క‌డి నుంచి వెంట‌నే బ‌య‌టికి వెళ్లిపోతుంది. ఇదే సంద‌ర్భంలో కార్తీక్ గురించి రుద్రాణికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇక ఇంటికి వెళ్లిన దీప దిగాలుగా క‌నిపిస్తూ సౌంద‌ర్య‌, ఆనంద‌రావుల గురించి ఆలోచిస్తూ వుంటుంది. అది గ‌మ‌నించిన కార్తీక్ `ఏంటీ దీపా ఇలా దిగాలుగా వున్నావ్‌` అంటాడు.

Also Read: ర‌వితేజ‌తో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ రొమాన్స్!

దీంతో అస‌లు విష‌యం చెప్పేస్తుంది. తాను అత్తయ్య‌, మావ‌య్య‌ల‌ని చూశాన‌ని చెబుతుంది. దీంతో కార్తీక్ ఒక్క‌సారిగా షాక్ అవుతాడు. వెంట‌నే నువ్వూ చూశావా? అంటాడు కార్తీక్‌. దీంతో అదేంటీ నువ్వూ చూశావా? అంటున్నారు మీరు చూశారా? అని అడుగుతుంది దీప‌. చూశాను దీపా.. ఎవ‌రూ లేని అనాథ‌ల్లా ఇద్ద‌రూ ప్ర‌కృతి వైద్య‌శాల‌లో వుంటున్నారు. నా గురించే బాధ‌ప‌డుతున్నారు.

అంటాడు కార్తీక్‌.. క‌ట్ చేస్తే పిల్ల‌లు హిమ‌, శౌర్య .. రుద్రాణిని చూసి భ‌య‌ప‌డిపోతుంటారు. సౌంద‌ర్య‌ని చూసి వెంట‌నే నాన‌మ్మా అంటూ ఆమె ద‌గ్గ‌రికి వెళ‌తారు. దీంతో కార్తీక్ .. సౌంద‌ర్య కొడుక‌ని రుద్రాణికి తెలిసిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోందన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.