English | Telugu

భర్త కోసం బిగ్ బాస్ గేట్ ముందు భార్య.. వీడియో వైరల్!

భర్త కోసం బిగ్ బాస్ గేట్ ముందు భార్య.. వీడియో వైరల్!


బిగ్ బాస్ మొదలై ఇప్పటికి ఇరవై రోజుల పైనే అవుతుంది. ఇప్పటికే హౌజ్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్.. వాళ్ళ కుటుంబసభ్యులని మిస్ అవుతున్నామంటు తమ బాధని కెమెరాలకి చెప్పుకున్న వాళ్ళున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి వారంలోనే  ఆట సందీప్ తన ఆటతీరుతో గెలిచి అయిదు వారాల ఇమ్యూనిటి సొంతం చేసుకొని మొదటి ఇంటి సభ్యుడయ్యాడు. ఆయితే ఆట సందీప్ ఈ మధ్య సీరియల్ బ్యాచ్ తో కలిసి ఎక్కువ టైమ్ ఉండటం వల్ల వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ కు ఆట సందీప్ కి మధ్య దూరం పెరిగే ఛాన్సులు చాలానే ఉన్నాయి. తన గేమ్ ఆడతే విజేత అయ్యే ఛాన్స్ ఉంది కానీ అలా కాకుండా సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ గా ఉంటే ఓటింగ్ లో చివరకి పడిపోతాడనేది వాస్తవం.

ఆట సందీప్ తను గెలుచుకున్న పవరస్త్రనీ తన కొడుక్కి డెడికేట్ చేశాడు‌. ఆట సందీప్ కి తన కొడుకుతో ఎంత బాండింగ్ ఉందో దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. సందీప్ భార్య జ్యోతి రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. నీతోనే డాన్స్ షోలో వీళ్ళిద్దరు కలిసి టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

జ్యోతి రాజ్ తన భర్త బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఎంతో ఎమోషనల్ అయింది. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. దానికి విశేష స్పందన వచ్చింది. జ్యోతి తన భర్తని చాలా మిస్ అవుతుందంట. అదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లోని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. " తను గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందుకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తాను. ఆ బాధ వైఫ్ లకి మాత్రమే తెలుస్తుంది" అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది జ్యోతి. భార్యభర్తల బాండింగ్ గురించి వీళ్ళిద్దరు చాలా సార్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‌ఆట సందీప్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలనుకునే జ్యోతి కల నెరవేరుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.