English | Telugu
బిగ్ బాస్ సీజన్-7 పై క్యాట్ రివ్యూ!
Updated : Sep 26, 2023
బిగ్ బాస్ సీజన్-7 పై క్యాట్ రివ్యూ ఇచ్చింది. అదే క్యాట్ గురించి దామిణి వాళ్ళ సిస్టర్ మౌనిమ రివ్యూ ఇచ్చింది. ప్రస్తుతం టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీల దగ్గర నుండి కామన్ పీపుల్ వరకు అందరి కన్ను ఈ హౌజ్ వైపేనని అనడంలో ఆశ్చర్యం లేదు. బిగ్ బాస్ ఈ సీజన్ ఉల్టా పల్టాగా సాగుతుంది. అయితే ఇందులో మొదట వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం షకీల, మూడవ వారం సింగర్ దామణి ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ లో వారం మొత్తం కంటెస్టెంట్స్ హౌస్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించగలగాలి. అందులో కొంచెం అటు ఇటు అయిన ప్రేక్షకులకు తమపై ఆసక్తి పోతుంది. ఎవరైతే హౌజ్ లో మంచి ప్రవర్తన కలిగి ఉండి, టాస్క్ లో ఆటతీరు, మాటతీరుతో అందరిని మెప్పించగలిగాలి. అలా అయితేనే హౌజ్ లో కొనసాగుతారు. చివరగా ఎలిమినేట్ అయిన దామిణి హౌజ్ లో తన పర్ఫామెన్స్ లేకపోవడం, తోటి కంటెస్టెంట్స్ తో రూడ్ గా ప్రవర్తించడం లాంటివి నచ్చక ప్రేక్షకులు తనకి ఓట్ వేయలేదు. ఓటింగ్ లో లీస్ట్ లో ఉండటం వల్ల బయటకు వచ్చేసిందని అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదంతా ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది.
దామిణి వాళ్ళ సిస్టర్ మౌనిమ బిగ్ బాస్ షో మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పాయింటాఫ్ లో రివ్యూ ఇచ్చింది. కాగా ఇప్పుడు ఆ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా క్యాట్ ఆ బ్యాగ్ నుండి బయటకు వచ్చేసింది. ఇన్ని రోజులు నేను క్యారీ చేస్తున్న స్ట్రెస్ ని తీసేసుకుంటాను. ఓపెనప్ అవుదామనుకుంటున్న అంటూ చెప్పింది మౌనిమ. బిగ్ బాస్ ఓట్లు అనేవి ఫేక్ అని, అఫీషియల్ ఓటింగ్స్ అంటూ ఏం ఉండవని, అనఫీషియల్ ఓటింగ్ నే లెక్కలోకి తీసుకుంటున్నారని చెప్పింది. హౌజ్ లో లవ్ ట్రాక్, తమ ఎక్స్ గురించి చెప్పుకోవడం, గొడవలు పడటం, టాస్క్ లలో ఒకరినొకరు తిట్టుకోవడం లాంటి కంటెంట్ పై ఆసక్తి తప్ప నాకు గేమ్ ఎక్కడ కన్పించలేదంటూ తన మనసులోని మాటలని చెప్పేసింది మౌనిమ. అయితే ఈ రివ్యూన చూసిన నెటిజన్లు.. ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని, హౌజ్ లో పర్ఫామెన్స్ బాగాలేకపోతే ఎవరైనా బయటకు రావాల్సిందేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు మౌనిమ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.