English | Telugu

ది బెస్ట్ జ్యూరీగా శివాజీ.. రతిక పాచిక పారలేదుగా!

బిగ్ బాస్ హౌజ్ లో ఎంత మంది స్ట్రాటజీలు ప్లే చేసిన శివాజీ ముందు కుదరదని మరోసారి ఋజువు చేశాడు. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా మరొకవైపు రతికరోజ్ కంటెంట్ కోసం చేసిన ఫాల్స్ అలిగేషన్ పనిచేయలేదు. బిగ్ బాస్ సీజన్-7 మొత్తంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో మొదటి పేరు పల్లవి ప్రశాంత్, రెండవ పేరు శివాజీ అని అందరికి తెలిసిందే. అయితే మిగతా కంటెస్టెంట్స్ దృష్టిలో శివాజీని బ్యాడ్ చేయడానికి రతికరోజ్ అలియాస్ రాధిక ఒక మాస్క్ గేమ్ ప్లే చేసింది.

రతిక కావాలని పల్లవి ప్రశాంత్ కి హోప్ ఇచ్చి, లవ్ ఇష్క్ కాదల్ అంటూ కబుర్లు చెప్పి తీరా మొదటి వారం అయిపోయి నామినేషన్లు అనగానే పల్లవి ప్రశాంత్ ని రతిక వెన్నుపోటు పొడిచిన విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రిన్స్ యావర్ ని టాస్క్ లో గెలిపిద్దామని అనుకున్నాను కానీ అందరు శివాజీని గెలిపించారని తెగ ఫీల్ అయినట్టు నటించిన రతిక, కాసేపటికి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి.. ప్రిన్స్ యావర్ హౌజ్ మేట్ పోటీకి అనర్హుడని చెప్పింది.

ఇక కన్ఫెషన్ రూమ్ లో రతిక మాటలని హౌజ్ లోని అందరికి చూపించాడు బిగ్ బాస్. అది చూసిన యావర్ మనసు ముక్కలైంది. ఇంత నమ్మించి మోసం చేస్తావా అంటూ కుమిలిపోయాడు యావర్. ఆ తర్వాత యావర్ ని అన్వర్ అంటూ ప్రేమ ఒలకబోసింది రతిక. దాన్ని చూసిన ప్రశాంత్.. అదంతా నమ్మకురా, నిన్ను చీట్ చేస్తుందని, నీ గేమ్ నువ్వు ఆడమని యావర్ తో పల్లవి ప్రశాంత్ చెప్పాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో శివాజీ దగ్గరికి వెళ్ళిన రతిక.. చేయి చేయి కలిస్తేనే చప్పట్లని నాగార్జున సర్ వచ్చినప్పుడు ఎందుకు అన్నారని వాదనకు‌ దిగింది.

అయితే అలా అంటే తప్పేముందని శివాజీ అనగా.. ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడతారంటూ రతిక వాగ్వాదానికి దిగింది. అమ్మ రతిక నువ్వు కంటెంట్ కోసమే చేస్తున్నావని తెలుస్తుంది కానీ నా దగ్గర అది కుదరదు నాగార్జున సర్ ఫుటేజ్ చూపిస్తాడు ఆ తర్వాత నీ పరువు పోతుందని సున్నితంగా చెప్పాడు శివాజీ. చూపించనివ్వండి అంటు రతిక మళ్ళీ అడుగగా.. అమ్మా రతిక, నేనేదో జోక్ గా , చాలా క్యాషువల్ గా అన్నాను. నీకు వేరేలా అనిపిస్తే సారీ అని శివాజీ అన్నాడు. అయినా వినకుండా వాగుతూనే ఉంది రతిక. దాంతో ఈ టాపిక్ ని ఇంకా సాగదీయకంటూ శివాజీ ఆ ఆర్గుమెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.