English | Telugu

Jayam serial: వీరు గురించి నిజం చెప్పేసిన గంగ.. సూర్యని రుద్ర కలుస్తాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -85 లో..... స్నేహ వచ్చి ప్రమీల కళ్ళు మూస్తుంది. గంగ నువ్వేనా అని ప్రమీల అంటుంది. అందరూ హాల్లోకి వస్తారు. స్నేహ నువ్వా.. గంగ అనుకున్నానని ప్రమీల అంటుంది. అందరు గంగ గురించి మాట్లాడుకుంటారు. ఒక పనిమనిషి గురించి ఇంత మాట్లాడుకుంటున్నారేంటని ఇషిక అంటుంది. మరొకవైపు వీరు తమ్ముడు సూర్య హాస్పిటల్ నుండి తప్పించుకొని బయటకు వస్తాడు.

అదే సమయంలో సూర్య ఎక్కడికి వెళ్లాడు.. వాడు రుద్రని కలిసే లోపే నా దగ్గరికి తీసుకొని రండి అని వీరు తన మనుషులకి చెప్తాడు. ఆ తర్వాత రుద్రని సూర్య చూసి తనకి నిజం చెప్పాలని చూస్తాడు కానీ రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రుద్ర ఇంటికి గంగ వస్తుంది. అది ఇషిక చూసి శకుంతలకి చెప్తుంది.

గంగను స్నేహ చూసి ఇంట్లో అందరిని పిలుస్తుంది. పెద్దసారు చూసి లోపలికి రమ్మని పిలుస్తాడు. గంగ లోపలికి వస్తుంటే ఆగమని శకుంతల అంటుంది. ఎందుకు వచ్చావని శకుంతల అనగానే.. మీకోక విషయం చెప్పాలి.. ఆ రోజు రుద్ర సర్ కి అగేనెస్ట్ గా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఈ రోజు హాస్పిటల్ లో చూసాను. వాళ్ళతో వీరు సర్ ఉన్నాడని గంగ చెప్పగానే మంచి ప్లాన్ తో వచ్చావని గంగని శకుంతల తిడుతుంది. తరువాయి భాగం లో రుద్రకి సూర్య ఫోన్ చేసి రమ్మంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.