English | Telugu
మేం ఆర్టిస్టులం కాకపోయి ఉంటే ఆ ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళం...
Updated : Mar 3, 2023
జానకి కలగనలేదు సీరియల్ సెట్ లో యూట్యూబర్ లోల నరేష్ ఒక వెరైటీ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసాడు. "ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు ? " అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆర్టిస్టులను ఫాలో అయ్యే ఫాన్స్ లో, ఆడియన్స్ లో ఆ డౌట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంగా ఈ సీరియల్ ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారు. " నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే లాయర్ అయ్యి చెట్టు కింద ప్లీడర్ లా కూర్చుని అన్ని కేసులు వాదించేవాడిని..మొదట్లో టిప్పర్ లారీ డ్రైవర్ అవ్వాలని ఉండేది ఎందుకంటే డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి.. " అని చెప్పాడు అమరదీప్. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే సినిమాటోగ్రాఫర్ ని అయ్యేవాడిని" అని చెప్పాడు మరో ఆర్టిస్ట్ అఖిల్.
"నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే టెర్రరిస్టు అయ్యేది" అంటూ నటి భవిష్య చేత చెప్పించారు మిగతా సీరియల్ యాక్టర్స్. ఐతే తనకు మాత్రం ఛార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఉండేదని చెప్పింది. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే ఎయిర్ హోస్టెస్ కానీ డాక్టర్ కానీ పోలీస్ కానీ అయ్యుండేదాన్ని" అని చెప్పింది సీరియల్ హీరోయిన్ అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. ఇక లోలా నరేష్ ని కూడా ఇదే ప్రశ్న అడిగింది ప్రియాంక " ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే వెటర్నరీ డాక్టర్ అయ్యేవాడిని ఎందుకంటే నాకు పశువులు అంటే ఇష్టం" అని చెప్పాడు. ఇలా ఈ సీరియల్ యాక్టర్స్ అంతా ఏం అవ్వాలనుకుని ఏం అయ్యారో చెప్పారు.