English | Telugu

మేమేమీ జాతకాలు చూపించలేదు...

లాస్య-మంజునాథ్ బుల్లితెర మీద మంచి హిట్ పెయిర్ అన్న విషయం అందరికీ తెలుసు. లాస్య ఆల్రెడీ యాంకర్ గా ఫుల్ ఫేమస్ పర్సన్. ఇక ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్న మంజునాథ్ కూడా ఈమధ్య బాగా ఫేమస్ అయ్యారు. షోస్ కి ఈ జంట వస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లాస్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ అప్ లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. "లాస్య టాక్స్" యూట్యూబ్ ద్వారా తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఈ జంట చాల క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చారు.

" లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్..ఏది బెటర్" అనేసరికి "ఏదీ కాదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు".. టోటల్ లైఫ్ లో ఏ రిలేషన్ చాలా బెస్ట్ అన్న ప్రశ్నకు "పెట్ తో ఉండే రిలేషన్ చాలా బెస్ట్..అలాగే మదర్ అండ్ బేబీ రిలేషన్ చాలా ప్యూర్ గా ఉంటుంది" అని చెప్పాడు. "మీ పెళ్ళికి ముందు జాతకాలు అవీ చూపించారా ?" అనేసరికి "లవ్ మ్యారేజ్ కాబట్టి అలాంటివి ఏమీ చూపించలేదు" అని చెప్పారు. "అక్కా మీరు డెస్టినీని నమ్ముతారా" అన్న ప్రశ్నకు "బాగా నమ్ముతాను..ఇలాంటి హస్బెండ్ దొరకడం నా డెస్టినీ" అని చెప్పింది లాస్య.

"మీరిద్దరూ గొడవ పడినప్పుడు ముందు ఎవరు మాట్లాడతారు" అనేసరికి "నేనే మాట్లాడతాను" అని చెప్పాడు మంజు. "రిలేషన్ మనీ అవసరమా" అన్న ప్రశ్నకు "డబ్బు ఉండాల్సిందే..డబ్బు లేకుండా ఏదీ లేదు" అని చెప్పారు. "మీ లవ్ మ్యారేజ్ కి మీ ఫామిలీ మెంబెర్స్ ని ఎలా కన్విన్స్ చేశారు" అనేసరికి "ఫామిలీ మెంబర్స్ ని కన్విన్స్ చేయడం పెద్ద టాస్క్. కొంచెం టైం తీసుకోండి. మీరు సెటిల్ ఐతే పేరెంట్స్ ఒప్పుకుంటారు." అని చెప్పారు. "నా కోసం చాలా కష్టపడతాడు..నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా చూసుకుంటారు. మేం ఎన్ని గొడవలు పడినా మా మధ్య అంత క్యూట్ బాండింగ్ అనేది ఉంటుంది." అని చెప్పారు లాస్య-మంజునాథ్.