English | Telugu
వేద నిజాయితీని యష్ నిరూపించగలడా?
Updated : Jul 8, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లి తెరపై గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ట్విస్ట్ లతో షాకిస్తూ ఆసక్తికరమలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ శుక్రవారం ఎలా సాగనుందో ఇప్పుడు చూద్దాం.
కైలాష్ తనని వేధించాడని, ఓ అమ్మాయితో నాటకం ఆడించి తనని పోలీస్టేషన్ లో పెట్టించాడని వేద చెబుతుంది. అయితే ఇదంతా కట్టుకథ అని, కావాలనే తన భర్త మీద బురద జల్లుతోందని యష్ సోదరి కంచు ఆరోపిస్తుంది. కైలాష్ నాటకం మొదలు పెట్టి వేద ఫోన్ నుంచి బూతు మెసేజ్ లు వచ్చాయని దొంగ సాక్ష్యాలు చూపిస్తాడు. దీంతో కంచు మరింతగా రెచ్చిపోయి వేదపై చేయి చేసుకోవడమే కాకుండా మరింత నీచంగా మాట్లాడుతూ వేదని వేధిస్తుంది. ఇంత జరుగుతున్నా యష్ కనీసం ప్రతఘటించడు..
ఇదే సమయంలో వేద తల్లి సులోచన, తండ్రి వరదరాజులు శర్మ ఎంట్రీ ఇస్తారు. తన కూతురిపై నేను బ్రతికుండగానే నిందవేస్తారా? అని సులోచన ఆగ్రహంతో ఊగిపోతుంది. నిప్పుని నిప్పు అని చెప్పాల్సిన అవసరం లేదని తప్పు ఎక్కడో జరిగిందంటుంది. ఎవడ్రా నువ్వు అంటూ కైలాష్ పై మండిపడుతుంది. కంచు కలగజేసుకుని వేదని నిందిస్తుంటే మళ్లీ ఆ కూత కూస్తే చెప్పు తెగుతుందని వార్నింగ్ ఇస్తుంది. మధ్యలో మాలిని ఎంటరై సులోచనని బెదిరించే ప్రయత్నం చేసినా సులోచన లెక్కచేయదు. కంచు ..వేదని మెడపట్టి బయటికి గెంటేయమనడంతో సులోచన మరింతగా ఫైర్ అవుతుంది. అది చెప్పాల్సింది యష్.. మిస్టర్ యశోధర్ చెప్పిండి అని నిలదీస్తుంది. యష్ మాట్లాడకపోవడంతో ఒక్క క్షణం కూడా నా కూతురిని ఇలాంటి చెడిపోయిన వారి ఇంటిలో వుండనివ్వనని వేదని తన వెంట తీసుకెళుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? యష్ మనలో ఏముంది? కైలాష్ భరతం పట్టాడా? వేద నిజాయితీని నిరూపించాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.