English | Telugu

పండు అబ్బాయి కాదు.. అమ్మాయి!

'వావ్.. మంచి కిక్కిచ్చే గేమ్ షో' మస్త్ ఫన్ తో, కామెడీతో దూసుకుపోతోంది. తాజాగా రాబోయే వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి రాకెట్ రాఘవ, కమెడియన్ రోహిణి, టిక్ టాక్ స్టార్ భాను, డాన్సర్ పండు వచ్చి ఎంటర్టైన్ చేశారు. 'టిక్ టాక్ లో నీకెవరు ఇన్స్పిరేషన్ భాను?' అని సాయికుమార్ అడిగేసరికి తన వీడియోస్ అన్ని కూడా వాళ్ళ అమ్మ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని చెప్పుకొచ్చింది భాను. పండు వచ్చి 'నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, లైక్స్ కొట్టి' అనేసరికి 'నువ్ కొట్టే లైటింగ్ కాదు రా' అంటూ రోహిణి పండుని ఆట పట్టిస్తుంది. 'జబర్దస్త్ లో ఏం జరుగుతోంది రాఘవ' అని అడిగేసరికి 'అంతా ఫైన్' అని చెప్తాడు రాఘవ.

'మీ అబ్బాయి నీ కన్నా సూపర్ గా, స్పీడ్ గా చేస్తున్నాడ'ని అనేసరికి అవునని సమాధానమిస్తాడు. "ఢీ షోలో పండు చేసిన "నాది నక్కిలీసు గొలుసు" సాంగ్ కి చేసిన అమ్మాయి గెటప్ తో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో 100 మిలియన్ మార్క్ దాటేసింది మరి నీ ఫీలింగ్ ఏమిటి?" అని సాయికుమార్ అడిగేసరికి "లేడీ గెటప్ వలన అన్ని వ్యూస్ వచ్చాయి" అని చెప్తాడు. బేసిక్ గా "పండు అబ్బాయి కానీ అతను అమ్మాయి" అని రోహిణి వేసిన డైలాగ్ కి పండు షాక్ ఐపోతాడు. మళ్ళీ రోహిణి మాట మార్చేసి "అమ్మాయిలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు" అంటుంది. తర్వాత రాఘవతో మస్త్ కామెడీ చేస్తుంది. అటు ఇటు తిప్పుతూ ఒక్క తోపు తోసేస్తుంది రోహిణి. ఇలా ఈ రాబోయే వారం షో ఎంటర్టైన్ చేయబోతోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..