English | Telugu

'ఒకే ఒక్క ఛాన్స్' అంటూ ఏడ్చిన‌ రోహిణి!

బుల్లితెర మీద ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోస్ కొత్త కామెడీ వస్తూనే వుంది. ఆడియన్స్ కూడా చక్కగా రిసీవ్ చేస్తుకుంటూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒక కొత్త షో అనేది ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ షోకి సంబంధించి మరో ఫన్నీ ప్రోమో వచ్చేసింది. డాన్స్ ఇండియా డాన్స్ షో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో కమెడియన్ రోహిణి హోస్ట్ అకుల్ బాలాజీతో చేసిన కామెడీ చాలా బాగుంది. ఈ షోకి గెస్ట్ గా సంగీత వచ్చింది. ఐతే సంగీత నటించిన 'ఖడ్గం' మూవీలోని "ఒకే ఒక్క ఛాన్స్" అంటూ సినిమాల్లో నటించటానికి అందరినీ అడిగే ఒక సన్నివేశం ఎవర్ గ్రీన్ ఎప్పటికీ. ఇప్పుడు సంగీత ప్లేస్ లో రోహిణి అలాంటి గెటప్ వేసుకుని స్టేజి మీదకు వచ్చి హోస్ట్ అకుల్ బాలాజీని ఆట పట్టించింది.

"సినిమా హీరోయిన్ ని చేస్తానని ఊర్లో నన్ను వదిలేసి వచ్చేసావ్. ఇప్పుడేమో నీ ఐడీ మార్చుకుని డిఐడి (డాన్స్ ఇండియా డాన్స్) చేస్తావా?" అంటూ ఏడ్చేసింది. బాలాజీకి ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నమిలాడు. అక్కడి నుంచి డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ దగ్గరకు వచ్చి "ఒక్క ఛాన్స్ " అని అడిగింది రోహిణి. ఆ డైలాగ్ కి ఒక వికారమైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చేసరికి రోహిణి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సంగీత తన డైలాగ్ తానే చెప్పింది. "నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్ తో అడిగితె నేను ఛాన్స్ ఇస్తామా" అంటూ బాబా భాస్కర్ అనేసరికి సంగీత నవ్వేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.