English | Telugu

ఉప్పెన మూవీలో సూర్యకాంతం,రేలంగి నటిస్తే ఇలా ఉంటుంది!


కృష్ణ భగవాన్ ఇటీవల జబర్దస్త్ షోలు చేస్తూ అందులో పంచ్ డైలాగ్స్ వేస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనతో పాటు నటి ఇంద్రజ కూడా జోక్స్ వేస్తూ పడీ పడీ నవ్వుతూ నవ్విస్తోంది. కృష్ణ భగవాన్ కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే బేసిక్ గా ఆయన రైటర్. కాబట్టి ఎప్పుడు ఏ టైములో ఏ డైలాగ్ చెప్తే అది ప్రోమోలోకి సూట్ అవుతుందో బాగా తెలిసినవాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. కొంతకాలం క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు అలా మల్లెమాల ప్రోగ్రామ్స్ కి ఆయన పర్మనెంట్ గా ఫిక్స్ ఐపోయినట్టు కనిపిస్తోంది.

ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో వీడియో కింద ఆడియన్స్ కృష్ణ భగవాన్ జడ్జిగా చేసేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో రాకెట్ రాఘవ స్కిట్ మాములుగా లేదనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఉప్పెన మూవీ అప్పటిలో సూర్యకాంతం, రేలంగి కలిసి తీస్తే అందులో వాళ్ళ నటన ఎలా ఉంటుందో చూడముచ్చటగా చేసాడు రాకెట్ రాఘవ. సూర్యకాంతం దివి నుంచి భువికి దిగి బుల్లితెర మీద జబర్దస్త్ షోకి వచ్చి స్కిట్ చేస్తోందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె నడిచే విధానం, చేతిలో విసనకర్ర, కొప్పు, అందులో పూలు, కళ్ళజోడు, మాట తీరు అచ్చు గుద్దినట్టుగా ఆమెను దించేసాడు.

ఇక ఈ స్కిట్ కి అందరూ కుష్ ఇపోయారు. ఇంద్రజ ఆమెను డైరెక్ట్ గా చూడలేకపోయినా మీ రూపంలో చూసుకునే భాగ్యం చేసుకున్నాం అనేసరికి కృష్ణ భగవాన్ మధ్యలో వచ్చి "ఆవిడది మా ఊరే ..కైకవోలు" అనేసరికి "సూర్యకాంతం గారు వచ్చిన ఊరు నుంచా మీరొచ్చారు ? " అని ఇంద్రజ ఆశ్చర్యపోతూ అడిగేసరికి "ఆ అక్కడి నుంచి వచ్చి ఇదా మీరు... అన్నట్టుగా అంటున్నారు మీరు ? " అని ఇంద్రజకి రివర్స్ లో కౌంటర్ వేసేసరికి అందరూ పగలబడి నవ్వారు. ఇక ఉప్పెన మూవీలోని "జలజలా పాతం" సాంగ్ కి సూర్యకాంతం పడవలో చేసే నాట్యం ఈ వారం షోకి హైలైట్ గా నిలిచిపోయేలా కనిపిస్తోంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.