English | Telugu
అలరించడానికి సిద్ధమైన 'రారండోయ్ పండగ చేద్దాం'!
Updated : Sep 21, 2022
పండగ అంటే అందరూ కలవాలి. అప్పుడే పండగ పండగలా ఉంటుంది. వినాయక చవితి రోజున వర్షం పడడం ఎంత కామనో, పండగ ఈవెంట్ లో గొడవలు పెట్టడం కూడా అంతే కామన్ అంటూ ప్రదీప్ మాచిరాజు "రారండోయ్ పండగ చేద్దాం" అనే సరికొత్త ఈవెంట్ తో జీ తెలుగులో ఎంటర్టైన్ చేయడానికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దసరా పండగ సందర్భంగా వస్తున్నఈ స్పెషల్ ఈవెంట్ 25 న సాయంత్రం 6 గంటలు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.
ఇందులో బుల్లి తెర సీరియల్స్ లో నటించేవాళ్లంతా కూడా పార్టిసిపేట్ చేసి ఫుల్ మస్తీ చేశారు. స్టేజి మీద అందరూ కలిసి పండగ విందును ఆరగించారు. ఈ షోకి శ్రీ విష్ణు, సుహాస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ఆమని, రోహిణి, బాబా భాస్కర్, వేణు వండర్స్, భానుశ్రీ, శోభా శెట్టి, దిలీప్ శెట్టి ఇలా చాలా మంది ఈ షోకి వచ్చి డాన్సులు చేశారు. లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న 'బంగారం'డైలాగ్ ని, మూవీస్, సీరియల్స్ లో ఫేమస్ ఐన డైలాగ్స్ ని మిక్స్ చేసి సరికొత్త స్కిట్స్ ఈ షోలో కనిపించబోతున్నాయి.