English | Telugu
హౌస్ లో అతను చాలా కన్నింగ్, ఫేక్ పర్సన్!
Updated : Sep 20, 2022
బిగ్ బాస్ ఈ షో గురించి ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ షోకి స్టార్టింగ్ లో వచ్చినంత క్రేజ్ ఇప్పుడు రావడం లేదు. ఇక ఈ హౌస్ వెళ్లిన డాన్సర్ , యాక్టర్ అభినయశ్రీ ఎలిమినేట్ ఐపోయి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈమె బీబీ కేఫ్ ని రన్ చేసే ఓల్డ్ బీబీ కంటెస్టెంట్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. " మనిషిని చూడగానే గొడవ పడడం..ప్రొబ్లెమ్స్ క్రియేట్ చేయడం వంటివి నేను చేయలేను. రియల్ లైఫ్ లో ఇవి నాకు అస్సలు ఇష్టం ఉండవు.
నేను అలాంటి మనిషిని కూడా కాదు..నాకు మనుషుల్ని ప్రేమించడమే తెలుసు. అవన్నీ నా వల్ల కాదు. కానీ బిగ్ బాస్ హౌస్ ఉండాలి అంటే అవన్నీ చేయాలి. బట్ నేను అవి చేయలేకపోయాను. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్. ఇదే కాదు కూర్చుని అందరూ మాట్లాడుకోవాలి. మధ్య మధ్యలో టాస్క్ లు ఇస్తారు. ఇవే కాదు ఇందులో మైండ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఐతే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు. వచ్చి ఉంటే వేరేలా ఉండేది.
హౌస్ లోకి వచ్చి తిని, కూర్చుని, మాట్లాడుకోవడమేనా అనిపించి గేమ్ ఆడాను. ఇక ఇంట్లో నాకు నచ్చని ఒకే ఒక పర్సన్ సింగర్ రేవంత్. నాకు అతను ఫేక్, కన్నింగ్ , ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తాడు. తన మాటే నెగ్గాలనుకుంటాడు." అంటూ హౌస్ గురించి, రేవంత్ గురించి హాట్ హాట్ కామెంట్స్ చేసింది అభినయశ్రీ.