English | Telugu
ధూమపానం, మద్యపానం, కళ్యాణం జీవితానికి హానికరం అంటున్న చంటి !
Updated : Aug 1, 2022
జబర్దస్త్ ఈ వారం ఫుల్ మస్తీ చేసేసింది. అద్దిరిపోయే కామెడీతో కమెడియన్స్ కడుపుబ్బా నవ్వించేసారు. ఇక చలాకి చంటి తన స్కిట్ లో ఎన్నో కొత్త విషయాలు కూడా చెప్పేసాడు . ఫోటోగ్రాఫర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్ చేసాడు చంటి. ఇందులో చంటి ఫోటోగ్రాఫర్ అన్నమాట. తన పెళ్లి రోజున కూడా ఫొటోస్ తీస్తూనే ఉంటాడు. ఐతే తన టీంలో ఉన్నవాళ్లు "పెళ్ళైన మగాడికి, పెళ్లికాని మగాడికి తేడా ఏమిటి" అని అడుగుతారు. పెళ్లికాని మగాడు జబర్దస్త్ లాంటోడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. పెళ్ళైన మగాడు ఎక్స్ట్రా జబర్దస్త్ లాంటోడు.
మొదట్లో నవ్వులుంటాయి ఫైనల్ గా ఏడుపులుంటాయి అంటాడు. మరి అమ్మాయిలకు తేడా ఏమిటి అని అడిగేసరికి అమ్మాయిలకు ఏదైనా సాధించాలని ఉంటుంది. పెళ్లి కాక ముందు నాన్నను, పెళ్లయ్యాక మొగుడిని సాధిస్తారంటాడు. అనసూయ ఫుల్ సీరియస్ ఐపోతుంది ఈ డైలాగ్ కి. ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే ధూమపానం, మద్యపానం, కళ్యాణం జీవితానికి హానికరం అంటాడు. ధూమపానం, మద్యపానం హానికరం అని తెలిసినా వదిలేస్తున్నామా ? లేదు కదా కళ్యాణం కూడా కానిచ్చేయడమే అంటాడు. పెళ్లికూతురిగా సునామి సుధాకర్ వచ్చేసరికి చూపించింది ఒక ఫోటో పెళ్లికూతురిగా తీసుకొచ్చింది ఇంకెవరినో అంటూ మండిపడతాడు. ఇలా ఒక ఫోటోగ్రాఫర్ కష్టాలను తన స్కిట్ లో చూపించాడు చంటి.