English | Telugu

విశాఖ గర్జనకు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు మ‌ద్ద‌తు!

ఏపీలో కాపిటల్ ఇష్యూ ఇప్పటికీ హీట్ పుట్టించే అంశమే. అమ‌రావ‌తి రైతులు మహాపాదయాత్ర చేసేసరికి ప్రభుత్వం రాజ‌కీయ ల‌బ్ది ల‌క్ష్యంగామూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అక్టోబర్‌ 15న "విశాఖ గర్జన"కు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్‌ అప్పారావు విశాఖ గర్జనకు మద్దతు ఇస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు. విశాఖపట్నం కళాకారుడిగా ‘మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ గర్జనను విజయవంతంగా చేయాలని.. ‘‘మన విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియలో ప్రజలంతా మద్దతు ఇవ్వాల"ని కోరారు. తాను అక్టోబర్‌ 15న విశాఖకు వస్తున్నట్లు చెప్పారు. "ఐ సపోర్ట్ ‘మన విశాఖ-మన రాజధాని’" అన్నారు. జబర్దస్త్ అప్పారావుకు పాలిటిక్స్ తో పని ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఆయ‌న‌ సొంత ఊరు విశాఖలో ఉన్న అక్కాయపాలెం.

అందుకే విశాఖపట్నం వాసిగా విశాఖను రాజధానిగా చేయాలని ఆయన కోరుకున్నట్లు చెప్పారు. ఇక జబర్దస్త్ అప్పారావు కొన్ని మూవీస్ లో నటించారు. తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు.