English | Telugu

ప్రియాంక గురించి ఓంకార్..వైల్డ్ కార్డు ఎంట్రీ


ఇస్మార్ట్ జోడి సీజన్ 3 నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలా ఇంటరెస్టింగ్ విషయాలను ఎపిసోడ్ లో మిక్స్ చేయబోతున్నాడు ఓంకార్ అన్న విషయం అర్ధమవుతోంది. ఇక ఈ షోకి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లాస్య- మంజునాథ్ ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఇక లాస్య మాట్లాడుతూ "లక్ లేక ఎలిమినేట్ అయ్యాను ఐతే అదే లక్ తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది" అని చెప్పింది. ఎందుకంటే లాస్ట్ వీక్ షో ఎలిమినేషన్స్ లో అనిల్ గీలా - ఆమనీ ఎలిమినేట్ ఇపోయారు. అలాగే రీల్ అండ్ రియల్ జోడీఎస్ ని ఈ షోలోకి తీసుకొచ్చాడు ఓంకార్. ఇక ఆడియన్స్ కి నెక్స్ట్ వీక్ షో అంతా కూడా ఫుల్ ఫన్ లా డిజైన్ చేశారు. ఏఏ సీరియల్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారో చూద్దాం.

నువ్వుంటే నా జతగా.. సీరియల్ నుంచి టాప్ లీడ్స్ అర్జున్ కళ్యాణ్, అనుమిత దత్త, మామగారు.. సీరియల్ నుంచి సుహాసిని , ఆకర్ష్ బైరాముడి, మగువ ఓ మగువ.. సీరియల్ నుంచి శ్రవణ్ కుమార్ , కృతిక ఉమాశంకర్, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్, శివ కుమార్, చిన్ని.. సీరియల్ నుంచి కావ్య, వీరేన్ శ్రీనివాస్, పలుకే బంగారమాయెరా.. సీరియల్ నుంచి నిఖిల్ నాయర్ , సంధ్య రామచంద్రన్ , ఇక సీరియల్ నటుడు మహేష్ వీళ్లంతా వచ్చారు. ఇక ప్రియాంక జైన్ - శివ కుమార్ వచ్చినప్పుడు ఓంకార్ ఒక ప్రశ్న అడిగాడు "పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాల్సినవన్నీ కూడా పెళ్ళికి ముందే అంటే" అని చెప్తూ లాస్య వాళ్ళను చూసి "మీరు కూడా ఏదో గుర్తు చేసుకుంటున్నారనుకుంటా" అన్నాడు. "అన్నా మీరు ఏది అనుకున్నారో మేము కూడా అదే అనుకున్నాం" అని చెప్పింది లాస్య. తర్వాత కావ్య వచ్చేసరికి ఆమెను కూడా అడిగాడు "లవ్ డెఫినిషన్" అనేసరికి "లవ్ అంటే లవ్ అంతే..మళ్ళీ ట్రస్ట్ అది ఇది అంటూ నేను చెప్పను" అంది కావ్య.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.