English | Telugu

కిరణ్ అబ్బవరం ప్రెగ్నెంట్...ఎం మాట్లాడుతున్నావు దీపికా..

డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రహ్మముడి కావ్య వేసే ఏ కంటెంట్ కామెడీ డైలాగ్స్ మాములుగా లేవు. ఎవర్రా దీపికాని ఈ షోకి తెచ్చింది అంటూనే ఆమె డైలాగ్స్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం రాబోతున్నాడు. ఇక స్టేజి మీదకు రాగానే ఓంకార్ బొకే ఇచ్చి ఇన్వైట్ చేసాడు. ఇక్కడి వరకు బానే ఉంది. తర్వాతే దీపికా టార్చర్ మొదలయ్యింది. "రహస్యంగా మిమ్మల్ని ఒకటి అడగాలి..రహస్య గారు ఎలా వున్నారు" అంది గుసగుసలాడుతూ.."బాగున్నారండి బాగున్నారు" అంటూ కిరణ్ కూడా రిప్లై ఇచ్చాడు. "మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా" అని అడిగేసింది.

ఇక శేఖర్ మాష్టర్ ఐతే "ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్" అన్నాడు. "నేను కాదండి. తను ప్రెగ్నెంట్" అన్నాడు కిరణ్. తర్వాత మళ్ళీ దీపికా "సర్ మీరిప్పుడు చూడలేదా..కపుల్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉంటే వి ఆర్ ప్రెగ్నెంట్ అని పెడుతున్నారు" అంటూ ఉన్న నిజాన్ని కామెడీగా చెప్పేసింది. "అవునా అండి...నేను చూడలేదు" అని చెప్పాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ ప్రోమోలో మాష్టర్లు, మెంటార్లు కలిసి డాన్స్ చేశారు. దానికి కిరణ్ "మాష్టర్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఎక్కడైనా డాన్స్ స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ అవుతా మాష్టర్ " అనేసరికి అందరూ నవ్వేశారు. "సర్ ఆ మాత్రం నాతో డాన్స్ చేయకుండా మీరు వెళ్ళిపోతే ఎలా" అని అడిగింది దీపికా. "అదొక్కటి వద్దమ్మా" అంటూ దీపికా డాన్స్ కి కిరణ్ అబ్బవరం కూడా భయపడిపోయారు. తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్ చేసారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.