English | Telugu
డూప్లికేట్ కమాండర్ ని పట్టుకున్నాడా.. ఇంట్లో వాళ్ళిద్దరి టెన్షన్!
Updated : Oct 14, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -287 లో.. భవాని కృష్ణ మాటలు గుర్తుకు చేసుకుంటుంది. కృష్ణ మాటలు చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది. ఎలాగైనా కృష్ణ ఆదర్శ్ ని తీసుకొని వస్తుందని భవాని అనుకుంటుంది.
మరొకవైపు ఏసీపీ సర్ ఎక్కడికి వెళ్ళాడని ఆలోచిస్తుంటుంది కృష్ణ. అప్పుడే రేవతి వచ్చి.. ఇంకా రాలేదు. నువ్వు మురారి గురించి కంగారుపడకని రేవతి చెప్తుంది. నేను ఎలాగైన ఆదర్శ్ ని తీసుకొని వస్తానని భవాని అత్తయ్యకి మాటిచ్చాను కదా. అందుకే ఏసీపీ సర్ ఆదర్శ్ ని తీసుకొని రావడానికి వెళ్ళాడు కావచ్చని రేవతితో కృష్ణ చెప్తుంది. వాళ్ళ దగ్గరికి భవాని వచ్చి.. మురారి ఎక్కడ కన్పించడం లేదని అడుగుతుంది. ఆదర్శ్ కోసం వెళ్ళాడు కావచ్చని మేం అనుకుంటున్నామని కృష్ణ చెప్పాగానే..
భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ ఇద్దరునీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. ఆదర్శ్ వచ్చాక ఇద్దరికి కలిపి రిసెప్షన్ చేస్తానని భవాని చెప్తుంది. మరొక వైపు మధు, అలేఖ్య ఇద్దరు ఎప్పటిలాగే పొట్లాడుకుంటారు. మరొకవైపు కృష్ణ తెల్లవారుజామున లేచి తులసి పూజ చేస్తుంది. అప్పుడే ముకుంద వచ్చి.. ఏం అప్లికేషన్ పెట్టుకున్నావంటు కృష్ణకి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. కానీ కృష్ణ సైలెంట్ గా ముకుంద కీ కౌంటర్ వేసి వెళ్తుంది. మరొకవైపు కృష్ణ ఆదర్శ్ ని తీసుకొని వస్తానని అంత కాన్ ఫిడెంట్ గా చెప్తుందంటే అసలేం చేస్తుందని అలేఖ్యని ముకుంద అడుగుతుంది. నాకేం తెలియదని అలేఖ్య చెప్తుంది.
మరొక వైపు ముకుంద ఫోన్ కి గీతిక ఫోన్ చేస్తుంది. ముకుంద ఫోన్ కృష్ణ లిఫ్ట్ చేస్తుంది. గీతిక డూప్లికేట్ కమాండర్ గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను అనుకున్నదే నిజమని కృష్ణ అనుకుంటుంది. ఈ విషయం మధుకి చెప్తుంది కృష్ణ. గీతిక ఏం మాట్లాడిందో చెప్తుంది.. ఆ డూప్లికేట్ కమాండర్ ని వెతికి తీసుకొని రమ్మని మధుని పంపిస్తుంది కృష్ణ. ఆ తర్వాత ముకుంద దగ్గరికి అలేఖ్య వచ్చి.. నీ మీద ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తుందని అలేఖ్య చెప్పగానే.. ముకుంద టెన్షన్ పడుతుంది. మధుకి అతను దొరికాడా లేదా అని కృష్ణ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.