English | Telugu

మహేంద్రకి నిజం తెలిసిపోయిందని తనతో చెప్పిన చక్రపాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -803 లో...మహేంద్ర కి జరిగిందంతా జగతి చెప్పేసరికి.. వాళ్ళిద్దరి సంగతి చెప్తానని మహేంద్ర అనగానే.. ఇప్పుడే వద్దని మహేంద్రకి జగతి సర్ది చెప్తుంది.

వసుధార ఎక్కడ ఉందో చెప్పు మహేంద్ర.. తనకి రిషి ఎక్కడ ఉన్నాడో తెలిసే ఉంటుందని జగతి అనగానే.. నాకు రిషి ఎక్కడ వున్నాడో తెలుసు. నేను రిషిని చూడలేదు కానీ రిషి మాట విన్నానని మహేంద్ర అంటాడు. రిషి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని జగతి అడుగుతుంది. రిషికి ఇంకా కోపం తగ్గలేదు. నేను కన్పిస్తే అక్కడ నుండి పారిపోతాడోమోనని నేను వెళ్ళలేదని మహేంద్ర అంటాడు.‌ మన కొడుకుపై పడ్డ నింద చెరిగిపోయి రాజకుమారునిలాగా ఇంటికి రావాలని మహేంద్ర అంటాడు. మనం తీసుకొని వద్దామని జగతి అంటుంది.

మరొక వైపు రిషి సర్ కి నేను ఇక్కడ ఉన్నానాని తెలిస్తే ఏం అనుకుంటాడో అని వసు ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఏంజిల్ వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నావా అని‌ వసుధారని అడుగుతుంది. మళ్ళీ వస్తానంటూ రిషి గదిలోకి వెళ్తుంది ఏంజిల్. ఏంటి రిషి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో వెళ్తున్నరో తెలుసుకోవా అని రిషీతో ఏంజిల్ అంటుంది. ఇప్పుడు ఎవరు వచ్చారని రిషి అనగానే పదా చూపిస్తానంటూ వసుధార దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వసుధార వాళ్ళ ఇంటికి అంత దూరం ఏం వెళ్తుందని నేనే ఇక్కడికి తీసుకొచ్చానని ఏంజిల్ అంటుంది. నువ్వు ఏమైనా అనుకుంటావేమో అని వసుధార బయపడుతుందని ఏంజెల్ అనగానే.. ఎవరో వస్తే నేనేందుకు అంటానని రిషి అంటాడు. రిషీనే వసుధారకి హెల్ఫ్ చేశాడని ఏంజిల్ కి వసుధార చెప్తుంది.

మరొక వైపు వసుధారకి చక్రపాణి ఫోన్ చేసి.. ఇప్పుడు ఎలా ఉందో కనుక్కుంటాడు. ఆ తర్వాత మహేంద్ర కలిసిన విషయం, రిషి ఎక్కడ ఉన్నాడో మహేంద్రకి చెప్పినట్లు వసుధారకి చెప్తాడు చక్రపాణి. ఎందుకు చెప్పావ్ నాన్న అని వసుధార అంటుంది. రిషి గురించి మహేంద్రకి తెలియడంతో టెన్షన్ పడుతుంది వసుధార. మరొక వైపు మహేంద్ర ఇన్ని రోజులు నిజం తెలియక జగతిపై కోప్పడ్డందుకు తనకి సారి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే .