English | Telugu
Guppedantha Manasu:కళ్ళుతిరిగి పడిపోయిన వసుధార.. రిషిని కిడ్నాప్ చేసిందెవరు?
Updated : Jan 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -985 లో.. రిషి, చక్రపాణి ఉంటున్న ఇంటికి రాజీవ్ వస్తాడు. కానీ అతను వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. మళ్ళీ తప్పించుకున్నావా రిషి అని రాజీవ్ అనుకుంటాడు. అప్పుడే రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేసి.. వాడు దొరికాడా అని అడుగుతాడు. లేదు జస్ట్ మిస్ అంటాడు. ఇంకా కన్పించలేదా అంటు శైలేంద్ర కోప్పడుతుంటాడు. నీకు ఎండీ సీట్ మాత్రమే కానీ నాకు నా మరదలు పిల్ల కావాలి. రిషి ఉన్నా లేకున్న ఎండీ సీట్ సాధించుకోవచ్చు కానీ నా మరదలని మాత్రం రిషి ఉంటే పొందలేను. ఆ రిషిగాడిని వేసేసి కాల్ చేస్తానని రాజీవ్ అంటాడు.
ఆ తర్వాత కాలేజీలో స్టూడెంట్స్ తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటారు. రిషి సర్ రావడానికి లేట్ అవుతుంది. అందుకే స్టూడెంట్స్ ని తమ అనుభవాలని షేర్ చేసుకోమని చెప్పండని లెక్చరర్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత యూత్ ఫెస్ట్ ని వసుధార సక్సెస్ చేసిందని ఫణింద్ర వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే వస్తున్న శైలేంద్రని ఫణింద్ర పిలిచి.. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావ్? ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంటే బయట ఏం చేస్తున్నావని ఫణింద్ర అడుగుతాడు. రిషి వస్తున్నాడు అన్నారు కాదా వెల్ కమ్ చెబుదామని బయట ఉన్నానని శైలేంద్ర అంటాడు. కావాలనే శైలేంద్ర వసుధారతో మాట్లాడతాడు. రిషి ఎక్కడ వరకు వచ్చాడో కనుక్కో వసుధారా అని శైలేంద్ర అనగానే.. అవును వసుధార కనుక్కో అని ఫణీంద్ర కూడా అంటాడు. ఆ తర్వాత రిషికి వసుధార ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడు. దాంతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ నాన్న ఫోన్ ఎవరో ఒక నర్సు లిఫ్ట్ చేసి.. ఈ ఫోన్ అతనికి గాయం అయిందని చెప్తుంది. మా నాన్నతో ఇంకొకరు ఉండాలని వసుధార అనగానే.. ఎవరు లేరు ఒక్కరే ఉన్నారని ఆ నర్సు చెప్పగానే వసుధార కళ్ళుతిరిగి కిందకి పడిపోతుంది.
ఆ తర్వాత వసుధార కళ్ళు తెరిచి చూసేసరికి ఇంట్లో ఉంటుంది. తలకి కట్టుతో చక్రపాణి కూడా ఉంటాడు. అసలు ఏమైంది నాన్న అని వసుధార అడుగుతుంది. ఏమైందో నాకు తెలియదు ఇద్దరం బయలుదేరి వస్తుంటే.. ఎవరో నా తల వెనకాల కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చక్రపాణి చెప్తాడు. ఈ పని శైలేంద్ర చేసాడని భావించిన వసుధార.. వెంటనే శైలేంద్ర దగ్గరకి వెళ్తుంది. రిషి సర్ ఎక్కడ అంటు కాలర్ పట్టుకొని అడుగుతుంది. తనపై చెయ్యి చేసుకుంటుంది. అనుపమ, మహేంద్ర ఇద్దరు ఆగమని చెప్పిన వసుధార వినదు. అంతలోనే దేవయాని, ఫణింద్రలు వచ్చి.. ఏం చేస్తున్నావ్ అని అడుగుతారు. వీడే రిషి సర్ ని ఏదో చేసాడని వసుధార అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.