English | Telugu

నా హైట్ చూసి పారిపోయాడు...నా బాయ్ ఫ్రెండ్ కి డ్రైవింగ్ రాదు

ఫారియా అబ్దుల్లా జాతి రత్నాలు మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమె హైట్ చూస్తే వామ్మో అనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి ఫారియా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. "రోడ్డు మీద ఏదో జరిగిందని విన్నాను...ఎవరికో వార్నింగ్ ఇచ్చారట. ఎవరో మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తుంటే మీరే కార్ తీసుకొచ్చి బయటకి వచ్చి వార్నింగ్ ఇచ్చారట నిజమా ?" అని సుమ అడిగేసరికి "ఫారియా కూడా నిజమే. నేను ఎప్పుడూ రెడీగా ఉంటారు ఫైట్ చేయడానికి. నేను చాల పీస్ ఫుల్ పర్సన్ ని.

అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. మంచి ఫైట్ చేయాలన్న కోరికగా ఉంది. అప్పట్లో మేము యాప్రాల్ లో ఉన్నాం. సైనిక్ పురి, యాప్రాల్ కొంచెం ఎడారి ప్రాంతాల్లా ఉండేవి. నేను కార్ లో వెళ్తుంటే వెనక బైక్ మీద ఒక పర్సన్ ఫాలో అవుతున్నాడు. నేను కార్ స్లో చేస్తుంటే అతను బైక్ స్లో చేస్తున్నాడు. నాకు మస్త్ కోపం వచ్చింది. కార్ పక్కకు ఆపి రా ఇటు రా అని అతన్ని పిలిచాను. అతను పారిపోయాడు..సాధారణంగా జనాలు నా హైట్ చూసి పారిపోతారు...దగ్గరకు రారు " అని చెప్పింది. దానికి సుమ నవ్వుతూ "నిజమే . కార్ లో కూర్చున్నంత సేపు ఎవరో పొట్టి పిల్ల అనుకుని ఉంటాడు. కార్ లోంచి బయటకు దిగేసరికి వామ్మో ఇంత పొడుగుందేమిట్రా బాబు అని పారిపోయి ఉంటాడు" అంది సుమ. "నా దృష్టిలో నా హజ్బెండ్ ఎలా ఉండాలి అంటే రోజూ ఫన్ ఉండాలి. నా పిల్లలు అతని కంపెనీని ఎంజాయ్ చేయాలి. బెస్ట్ ఫ్రెండ్ లా ఉండాలి. హోమ్ స్కూలింగ్ టైంలో ఇద్దరం కలిసి పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలి. పిల్లల కోసమే కదా పెళ్లి చేసేది. ఇవన్నీ చేయనప్పుడు పెళ్లి లేకుండానే ఛిల్ల్ అవ్వొచ్చు కదా" అంది ఫారియా. బాయ్ ఫ్రెండ్ పేరులో ఫస్ట్ లెటర్ చెప్పమని సుమా అడిగినా ఫారియా చెప్పలేదు. ఐతే తనకు అతనంటే ఇస్తామని.. ఇంచుమించు తన హైట్ ఉంటాడని...మన మండి బిర్యాని అంటే ఇష్టం..లాంగ్ డ్రైవింగ్ ఇష్టం కానీ అతనికి డ్రైవింగ్ రాదు..తనకంటే ఎక్కువగా తెలుగు సినిమాలు ఇష్టమని కానీ తెలుగు డబ్డ్ హిందీ మూవీస్ చూస్తారని చెప్పింది ఫారియా.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.