English | Telugu

ఈ వారం ఎలిమినేషన్ ఫైమానా? లేక శ్రీసత్యనా?

ప్రస్తుతం బిగ్ బాస్హౌస్ లో ఒక్కొక్కరి మధ్యలో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అయితే దాన్ని బట్టి కంటెస్టెంట్స్ లో ఎవరు బయటికి వెళ్లాలని అనుకుంటున్నారో? అందరూ కలిసి ఒక కంటెస్టెంట్ ని సెలక్ట్ చేసుకుంటారని తెలుస్తుంది. అలా జరిగితే మాత్రం హౌస్ లో అందరూ కూడా ఒకరితో ఒకరు ఆర్గుమెంట్ చేసుకుంటారు.

అయితే ఆదిరెడ్డి టాస్క్ లు సరిగ్గా చేయకుండా, సోది మాటలు చెప్తున్నాడు. దీంతో ఫైమా తర్వాత ఎక్కువ అవకాశం ఆదిరెడ్డికే ఉంది. అయితే శ్రీసత్యని ఎలిమినేట్ చేయాలని గత మూడు వారాల నుండి బిగ్ బాస్ ఫ్యాన్స్, ప్రతిప్రోమో కింద కామెంట్స్ రూపంలో తమ నిరసనని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 'అసత్య ఎలిమినేట్ కావాలి' అంటూ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి ట్రెండ్ నే సృష్టించారు ఫ్యాన్స్. కానీ శ్రీసత్య తన ఆటతీరును, మాటతీరును మార్చుకోకుండా.. ఇంకా వెటకారంను చూపిస్తూ వస్తోంది. ఇది ప్రేక్షకులకు చాలా చిరాకుగా ఉంటుందని చెప్తున్నారు.

ఇదేవిధంగా ఫైమా కూడా తన ఓవరాక్షన్ తగ్గించుకోవట్లేదు. హౌస్ మేట్స్ చెప్పినా వినకుండా అలాగే పర్ఫామెన్స్ ఇస్తే, "ఫైమా.. ఎప్పుడు బయటకొస్తుందిరా సామీ" అని అనుకుంటారు ప్రేక్షకులు. గతవారమే బయటకొచ్చేయాల్సింది ఫైమా. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్తన వద్ద ఉండటం వల్ల సేవ్ అయ్యింది. అయితే శ్రీసత్య, ఫైమా ఇద్దరిలో ఎవరు బయటకొచ్చినాప్రేక్షకులు సంబరాలు చేసుకుంటారు అని అనడంలో అతిశయోక్తి లేదు.