English | Telugu

సపోర్ట్ తో ఆడిన రేవంత్, సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు: ఫైమా

బిగ్ బాస్ హౌస్ లో గొడవలు మామూలు అయ్యాయి. నామినేషన్స్ అంటేనే ఒకరి మీద ఒకరు సిల్లీ రీజన్స్ చెబుతూ నామినేషన్ చేసుకుంటారు. అయితే నిన్న మొన్నటి దాకా ఫైమా, ఇనయాల మధ్య గొడవ కాస్తా ఇప్పుడు రేవంత్, ఫైమాల మధ్య గొడవలా మారింది.

కారణం రేవంత్ తన సెకండ్ నామినేషన్ గా ఫైమాని చేసాడు. ఆ తర్వాత "ఫైమా.. నీకు ఎటకారం తగ్గిందనిఅనుకుంటున్నావ్. కానీ తగ్గలేదు. నీ వెటకారం నా వద్ద వద్దు. ఇంకెవరి దగ్గరైనా చూపించుకో. రోహిత్ ని స్ట్రాంగ్ అని నామినేట్ చేసావ్. రోహిత్ ని స్ట్రాంగ్ అంటున్నావ్ అంటే నువ్వు వీక్. అయినా వీక్.. వీకెస్ట్ కంటెస్టెంట్ హౌస్ లో ఉండకూడదు. ఇది నా సెకండ్ పాయింట్" అని రేవంత్, ఫైమాతో అన్నాడు. "నువ్వు ఏం చేసినా కరెక్ట్. నేనే తోపు అని అనుకోకు. నువ్వే సపోర్ట్ తో ఆడినవ్. సపోర్ట్ తో ఆడిన రేవంత్.. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు" అని ఫైమా వేలు చూపిస్తూ మాట్లాడింది. "వేలు చూపించి మాట్లాడకు‌. నార్మల్ గా మాట్లాడు ఫైమా" అని రేవంత్ గట్టిగా అరిచాడు.

"ముందు ఒక మాట మాట్లాడుతాడు. వెనుకాల ఒకటి మాట్లాడుతాడు‌. అది ఎవరికి ఎందుకు కనపడట్లేదు" అని ఫైమా అంది. అయితే ఈ వారం ఫైమా, రేవంత్ ఇద్దరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో స్ట్రాంగ్ ఎవరంటే కచ్చితంగా రేవంత్ అనే చెబుతారు‌. అంత ఫ్యాన్ బేస్ సంపాందించుకున్నాడు రేవంత్. కానీ ఫైమా మాత్రం ఎప్పుడు చూసినా, తన అతితెలివితో గొడవలకు దిగుతుంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.