English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఆస్తి పేపర్లు తిరిగిచ్చేసిన సవతి తల్లి.. భర్త కోసం యాగం చేపిస్తున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -322 లో... సీతాకాంత్ కి హాని ఉందని రామలక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసి అందరు షాక్ అవుతారు. మా అమ్మవాళ్ళు మారారు అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. మేమ్ ఏం చేస్తే మీరు నమ్ముతారని సందీప్ అంటాడు. మీరేం చేస్తే నమ్ముతారో నాకు తెలుసని శ్రీలత పైకి వెళ్లి ఆస్తుల పేపర్స్ తీసుకొని వచ్చి.. దీని కోసమే మేమ్ మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నామని నువ్వు అనుకుంటున్నావ్ కదా.. అని డాక్యుమెంట్స్ రామలక్ష్మికి ఇస్తుంది శ్రీలత.

నాక్కూడా ఆస్తులు వద్దు వదిన.. నన్ను కూడా అలాగే అనుకుంటదని సిరి అంటుంది. శ్రీలత ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఆస్తులు వద్దు ఏం వద్దు ఇంట్లో ఉండనిచ్చి ఒక పూట భోజనం పెట్టండి అని శ్రీలత అంటుంది. దాంతో బాధపడకు అమ్మ అని శ్రీలతని సీతాకాంత్ అక్కడ నుండి తీసుకొని వెళ్తాడు. రామలక్ష్మి మాత్రం అసలేం అర్థం కాదు. అత్తయ్య వాళ్ళు నిజంగా మారారు.. నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అని అనుకుంటుండగా.. తన అంతరాత్మ బయటకు వచ్చి అలా మంచిగా మారానని చెప్పినంత మాత్రాన మారినట్టు కాదు.. వాళ్ళ బుద్ది వంకరే అని అంటుంది. సీతా గారు ఇక నీకు దూరం అవుతారని అంతరాత్మ చెప్తుంది. అనవసరం గా అత్తయ్య వాళ్ళ గురించి అలోచించి.. నేను సీతా గారితో ఉండాలిసిన టైమ్ వేస్ట్ చేస్తున్నానని రామలక్ష్మి అనుకుటుంది. మరొకవైపు అమ్మ నువ్వు గతంలో చేసిన తప్పులకి వదిన నిన్ను నమ్మడం లేదు.. ఇకనైనా అందరు బాగుండండి అంటూ సందీప్, ధన, శ్రీలతలకి సిరి చెప్తుంది.

సీతాకాంత్ నిద్ర లేచేసరికి రామలక్ష్మి నృత్యం చేస్తుంది. ఏంటి ఇది అని సీతాకాంత్ అడుగగా.. నాకు ఇష్టం అందుకే చేస్తున్నా.. నాకు ఒక కోరిక ఉంది. ఈ రోజు మొత్తం మనం ఇద్దరమే ఉండాలని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మికి స్వామి ఫోన్ చేసి.. ఇప్పుడే యాగం మొదలైంది. రేపటి వరకు జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి అని స్వామి చెప్పగానే రామలక్ష్మి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.