English | Telugu

Karthika Deepam2 : పూజకి శివన్నారాయణని ఆహ్వానించిన దీప.. జ్యోత్స్నతో మాటల యుద్ధం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -275/ లో.... అసలు దీపకి డబ్బు ఎవరు ఇచ్చారు.. అది నేను చెయ్యాల్సిన పని.. ఇప్పుడు దీప ఎదురు అయితే ఎలా ఫేస్ చెయ్యాలని సుమిత్ర అనుకుంటుంది. అప్పుడే దీప ఇంటి గుమ్మం ముందు వచ్చి ఉంటుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి లోపలకి రా అని శివన్నారాయణ అంటాడు. ఏంటని దీప అడుగుతుంది. శౌర్యా ఎలా ఉంది మొదటి ప్రశ్న.. ఇప్పుడు బాగుందని దీప చెప్తుంది. రెండవది డబ్బుల కోసం వాళ్ళు వచ్చారు.. నువ్వు ఎందుకు రాలేదని శివన్నారయణ అడుగగా.. అందరికి తెలిసాక నాకు తెలిసింది శౌర్య పరిస్థితి అని దీప చెప్తుంది.

నీ భర్త నా ఇంట్లో అడుగుపెట్టను అన్నాడు.. ఇప్పుడు నువ్వు లోపలికి వస్తావా అని అనగానే.. దీప రాకుండా బయటే ఉంటుంది. ఇంతకు ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. శౌర్య బాగుంటే కాంచన గారు పూజ చెయ్యాలని మొక్కుకున్నారంట.. పూజ చేస్తున్నాం.. మీరు రావాలని దీప అంటుంది. డబ్బుకి నువ్వు రావాలిసింది.. వాళ్ళు వచ్చారు.. ఇప్పుడు పూజకి పిలవాల్సింది మీ అత్త కానీ నువ్వు పిలుస్తున్నావ్ అంటూ అందులో నెగిటివ్ గా శివన్నారాయణ అంటాడు. దీప గడపకి బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత దీప వెళ్లిపోతుంటే.. నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది.

ఇద్దరి మధ్యలో మినీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇంతకు డబ్బు ఎవరు ఇచ్చారని జ్యోత్స్న అడుగగా.. చెప్తే ఏం చేస్తావని దీప అడుగుతుంది. సన్మానం చేద్దామని జ్యోత్స్న అనగానే.. అయితే విను అని కార్తీక్ పేరు అంటుంది. ఇప్పుడు రెడీ చేసుకో సన్మానానికి క్యాటరింగ్ ఉంటే చెప్పు.. కార్తీక్ టిఫిన్ సెంటర్ ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని దీప అంటుంటే.. జ్యోత్స్నకి ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే తనే అసలైన వారసురాలని తెలిస్తే ఇంకా ఎలా పొగరు ఉంటుందోనని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత కావేరి దగ్గరికి దీప వెళ్లి పూజకి పిలుస్తుంది. దీపని శ్రీధర్ చూసి.. ఎందుకు వచ్చిందని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.