English | Telugu

ఆమెను కాలేజీలో జాయిన్ చేయించిన సీతాకాంత్.. భద్రం ఫ్రాడ్ అని చెప్పిన రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-305 లో... ఒక అమ్మాయిని పెద్దావిడ చదువుకొమ్మని రిక్వెస్ట్ చేస్తుంటే చదువుకోనని ఆ అమ్మాయి అంటుంది. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్ లు తమ దగ్గరికి వస్తారు. ఎందుకు చదువుకోనంటున్నావంటూ అడుగుతారు. ఇప్పటికే మా నానమ్మ నన్ను కష్టపడి చదివించింది. ఇప్పుడు మళ్ళీ తనని కష్టపెట్టలేను.. ఇంజినీరింగ్ లో మంచి సీట్ వచ్చింది కానీ రెండు లక్షలు డబ్బు కట్టమన్నారని అమ్మాయి శృతి అంటుంది. దాంతో నేను చూసుకుంటా నాతో రండి అని శృతి ఇంకా పెద్దావిడని తీసుకొని సీతాకాంత్ కాలేజీకి వెళ్తాడు.

మరొకవైపు రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్లేసరికి అక్కడ వెంచర్ లో ల్యాండ్ తీసుకున్న వాళ్ళందరూ గొడవ చేస్తుంటారు. రామలక్ష్మి వాళ్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా వినిపించుకోకుండా పోలీస్ కంప్లైంట్ అంటారు. కానీ నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని రామలక్ష్మి మాటిస్తుంది. మరొకవైపు సీతాకాంత్ ని లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ అడ్డుపడతాడు. అది సీసీ టీవీలో చూసిన ఎండీ సీతాకాంత్ దగ్గరికి వచ్చి లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇది మీ కాలేజీ సర్ అంటూ సీతాకాంత్ గురించి గొప్పగా మాట్లాడతాడు. బయటున్న అమ్మాయి పేరు శృతి. తను ఈ కాలేజీలో చదవాలనుకుంటుందని చెప్తాడు. శృతి, పెద్దావిడలని లోపలికి పిలుస్తాడు. మీరు ఇక్కడ చదవండి డబ్బు కట్టనవసరం లేదని అంటాడు. పెద్దావిడ అక్కడ సీతాకాంత్ ఫోటో చూసి మీ ఫోటో ఇక్కడ ఉందని అడుగగా.. సీతాకాంత్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకేసారి ఇద్దరు ఫోన్ చేసుకుంటారు కానీ కల్వదు. ఆ తర్వాత రామలక్ష్మి ఆఫీస్ దగ్గర జరిగింది సీతాకాంత్ కి చెప్తుంది. ఆ తర్వాత శ్రీలత ఇంటికి రామలక్ష్మి వెళ్లి ధన, సందీప్ ఎక్కడ అని అడుగుతుంది. ధన, సందీప్ రాగానే మీరు చేసిన వెంచర్ కి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా అని అడుగుతుంది. అదంతా భద్రం చూసుకుంటాడని సందీప్, ధన చెప్పగానే.. వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అని రామలక్ష్మి చెప్తుంది. దాంతో వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.