English | Telugu
Brahmamudi : నగలు కావ్యకి ఇచ్చేసిన ఇందిరాదేవి.. వాళ్ళ పరువుతీయాలని అనామిక స్కెచ్!
Updated : Jan 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-622 లో....రాహుల్, రుద్రాణి కలిసి కావ్య నగలు తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్ కట్టిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే మీరు చూడలేరా అని రుద్రాణి పై రాజ్ కోప్పడతాడు.
ఇక కావ్య అందరి ముందు తప్పు చేసిందానిలాగా ఉండకూడదని నేనే నగలు తాకట్టు పెట్టమని చెప్పాను.. అకౌంట్స్ అన్ని హోల్డ్ లో ఉన్నాయ్ కదా అందుకే అలా చెప్పానని అపర్ణ చెప్తుంది. ఏం చాకచక్యంగా సమాధానం చెప్పావని అపర్ణని అంటుంది రుద్రాణి. నీకేం హక్కు ఉందని నిలదీస్తున్నావ్ రుద్రాణి.. గేంటెస్తే బయటకు వెళ్లిపోతావంటూ రుద్రాణికి చివాట్లు పెడుతుంది అపర్ణ. మరి నగల గురించి అడిగినప్పుడే ఎందుకు చెప్పలేదని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు సెన్స్ ఉంది.. అప్పుడే చెప్తే ఈ రుద్రాణి అప్పుడే గొడవ చేసేదని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు అవమానంగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోతారు.
ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి కావ్య ఇంటికి వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు అసలు నిజం చెప్పమని కావ్యని నిలదీస్తుంది అపర్ణ. కానీ కావ్య డైవర్ట్ చేస్తుంది. కావ్య చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేది.. నువ్వు సైలెంట్ గా ఉండమని అపర్ణతో ఇందిరాదేవి అంటుంది. నాకేం జరిగుతుందోనని టెన్షన్ గా ఉంది నిజం చెప్పమని అపర్ణ అంటుంది. అయినా కావ్య చెప్పకపోవడంతో.. ఇక నువ్వు నాతో మాట్లాడకని అపర్ణ కోపంగా వెళ్లిపోతుంది. అసలు సమస్య ఏంటో ఇంటిపెద్దగా నేను కనుక్కోవాలని ఇందిరాదేవి అనుకుంటుంది.
ఆ తర్వాత రాజ్, కావ్య లు జరిగింది గుర్తుచేసుకుంటారు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వచ్చిందని రాజ్ అంటాడు. ఏంటని కావ్య అడుగగా.. ఇక నిజం అంతా ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామని అంటాడు. దానికి రుద్రాణి, ధాన్యలక్ష్మి లు ఎలా మాట్లాడుతారో కావ్య ఉహించుకొని చెప్తుంది. దాంతో వద్దని రాజ్ అంటాడు.
తరువాయి భాగంలో నీకు తోడుగా ఉంటానని ఇందిరాదేవి నగలు కావ్యకి ఇస్తుంది. మరొకవైపు రాజ్ వాళ్ళు అప్పులు చేస్తున్నారని ఈ విషయం మీడియాకి చెప్పి లైవ్ ని ఎంజాయ్ చేద్దామని సామంత్ తో చెప్తుంది అనామిక. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.