English | Telugu

చాటుగా వినేసిన దశరథ్.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనడంతో జ్యోత్స్న టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-258 లో.... శౌర్య హాస్పిటల్ ఖర్చు గురించి కార్తీక్ తన ఫ్రెండ్ ని అప్పు అడుగుతాడు. తన ఫ్రెండ్ అప్పు ఇవ్వకుండా తనని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత అదంతా చూసిన కాశీ.. కార్తీక్ దగ్గరికి వస్తాడు. శౌర్య సిచువేషన్ గురించి కాశీకి చెప్తాడు కార్తీక్. మరి నన్నెందుకు అడగలేదని కాశీ అనగానే.. మీ సిచువేషన్ చూసి ఎలా అడుగుతానని కార్తీక్ అంటాడు. నా దగ్గరున్నాయ్ ఇస్తానని కాశీ అనగానే.. మనసు వద్దని అంటుంది కానీ అవసరం తీసుకోమంటుందని సరే అని కార్తీక్ అంటాడు. నువ్వేంటి ఇక్కడున్నావని కాశీని కార్తీక్ అడుగుతాడు. నాన్న నిన్నటి నుండి కనిపించడం లేదని కాశీ చెప్తాడు. అవునా సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అంటాడు. దానికి కాశీ సరే అంటాడు.

మరొకవైపు దాస్ గురించి జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే.. అప్పుడే పారిజాతం వస్తుంది. నా కొడుకుని ఏం చేసావే ఫోన్ కలవడం లేదని అడుగుతుంది. నీ కొడుకు గురించి నాకేం తెలుసని జ్యోత్స్న అంటుంది. మొన్న దాస్ కాళ్ళు పట్టుకున్నావని పారిజాతం అంటుంది. అదంతా దశరథ్ వింటాడు. దాస్ కాళ్ళు జ్యోత్స్న ఎందుకు పట్టుకుందని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత నీ కొడుకు గురించి నాకేం తెలియదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీప వస్తుంటే దార్లో కొందరు రౌడీలు పిల్లాడిని ఎత్తుకొని వెళ్తుంటే.. రౌడీల కళ్ళలో దీప కారం కొట్టి బాబుని కాపాడి తన పేరెంట్స్ కి ఇస్తుంది. దాంతో వాళ్లు దీపకి థాంక్స్ చేప్పి ఏదైనా సాయం చేస్తామంటే దీప వద్దని చెప్తుంది.

మరొకవైపు శివన్నారయణ జ్యోత్స్న లు రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటుంటే.. అప్పుడే కాశీ వస్తాడు. మా నాన్న కన్పించడం లేదని అంటాడు. దాంతో పారిజాతం టెన్షన్ పడుతుంది కానీ శివన్నారాయణ‌ మాత్రం ఎక్కడ తిరుగుతున్నాడోనని అంటాడు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని కాశీ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత కాశీ వెళ్ళిపోయాక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాస్ గురించి తెలుస్తుంది. దాస్ బాగై అసలు నిజం చెప్పేవరకు దాస్ గురించి ఎవరికి తెలియనివ్వొద్దు.. ఇప్పుడేం చెయ్యాలని దశరథ్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.