English | Telugu

వ‌ర్ష‌ అమ్మాయి కాద‌న్న ఇమ్మాన్యుయేల్‌.. వాకౌట్ చేసిన వ‌ర్ష‌!


జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోల్లో ఎవ‌రు జంట‌గా క‌నిపించినా పాపుల‌ర్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్.. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల కార‌ణంగా పాపులారిటీని సొంతం చేసుకుని సెల‌బ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మ‌రో జంట గ‌త కొంత కాలంగా ఈ షోలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ జంట. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుద‌ర‌డంతో నిర్వాహ‌కులు వీరిని జంట‌గా ఫిక్స్ చేసి ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు.

గ‌త కొంత కాలంగా వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్‌ జంట జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల‌తో పాటు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ షోలోనూ ఆక‌ట్టుకుంటూ వ‌స్తోంది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ వీరి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. ఇద్దరూ క‌లిసి స్కిట్ లు చేయ‌డం లేదు. వ‌ర్ష మ‌రో క‌మెడియ‌న్ బుల్లెట్ భాస్క‌ర్‌ తో క‌లిసి స్కిట్ లు చేస్తూ వ‌స్తోంది. తాజాగా వ‌ర్ష‌, ఇమ్మానుయేల్‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు తారా స్థాయికి చేరిన‌ట్టుగా బ‌య‌ట‌ప‌డింది. వ‌ర్ష అస‌లు అమ్మాయే కాదంటూ తాజాగా ఇమ్మాన్యుయేల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

వ‌ర్ష‌పై ఇమ్మాన్యుయేల్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వ‌ర్ష‌ని అమ్మాయి కాదంటూ కామెంట్ చేయ‌డంతో షో నుంచి వ‌ర్ష అర్ధంత‌రంగా బ‌య‌టికి వెళ్లిపోయింది. ఇమ్మాన్యుయేల్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డిందంటూ వ‌ర్ష క‌న్నీళ్లు పెట్టుకుంటూ షో నుంచి బ‌య‌టికి వెళ్లిపోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. `ఈటీవీ` కోసం చేసిన స్పెష‌ల్ షో `రంగ్ దే` ఈ వెంట్ లో తాజా సంఘ‌ట‌న చోటు చేసుకుంది. హోలీ ఫెస్టివెల్ సంద‌ర్భంగా మ‌ల్లెమాల వారు ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ ఇమ్మాన్యుయేల్ కార‌ణంగా ర‌సాభాస‌గా మార‌డం గ‌మ‌నార్హం.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.