English | Telugu
శౌర్య కారణంగా అనాథగా మారిన హిమ!
Updated : Mar 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొనసాగిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా రేటింగ్ పరంగా, వీక్షకాదరణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పరిటాల నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ కి తాజాగా డైరెక్టర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వీక్షకులకు భారీ షాకిచ్చాడు. ఉన్నట్టుండి డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలని చంపేశాడు. దీంతో ప్రతీ ఒక్కరూ ఇప్పుడు డైరెక్టర్ ని తిట్టడం మొదలుపెట్టారు. గతి తప్పిన సీరియల్ ని గాడిలో పెట్టాలి కానీ మొత్తానికే చంపేస్తావా? అంటూ డైరెక్టర్ పై కామెంట్ లు చేస్తున్నారు.
Also Read:సామ్ తో మైత్రీ వారి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్!
ఇక హిమ అతి కారణంగా కార్ యాక్సిడెంట్ లో డాక్టర్ బాబు, వంటలక్కలు చనిపోతారు. గత కొన్ని రోజులుగా దీనిపై ప్రోమోల్లో హింట్ లు ఇస్తూ వచ్చిన దర్శకుడు చివరికి తను అనుకున్నట్టుగానే డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు `కార్తీకదీపం` సీరియల్ లో ఎండ్ కార్డ్ వేసేశాడు. ఈ ఇద్దరూ చనిపోవడంతో సౌందర్య ఇంట్లో విషాదం అలుముకుంటుంది. చంద్రమ్మ - ఇంద్రుడు వద్ద స్పృహలోకి వచ్చిన హిమ తనని హైదరాబాద్ తీసుకెళ్లమని ఏడుస్తుంది.
కట్ చేస్తే హిమ పచ్చ బొట్టుని తీసేయాలని అరుస్తూ శౌర్య నీళ్లతో కడుగుతూ వుంటుంది. అది గమనించిన సౌందర్య ఫ్యామిలీ బాధపడుతుంటారు. ఇంతలో అక్కడికి వారణాసి బస్తీవాసులతో కలిసి వస్తాడు. హిమని క్షమించనని శౌర్య అనగా, పాపం హిమ అంటూ వారణాసి మాట్లాడుతుంటే ఆపు వారణాసి అంటూ అరుస్తుంది శౌర్య. తనే అమ్మా నాన్నలని చంపేసిందని బోరుమంటుంది. ఇక మాకు దిక్కెవ్వరని బస్తీవాసులు సౌందర్యతో మొరపెట్టుకుంటారు. మీకు మేమున్నామని సౌందర్య ఓదారుస్తుంది. కట్ చేస్తే హిమని హైదరాబాద్ తీసుకురావడానికి డబ్బులు లేకపోవడంతో చంద్రమ్మ, ఇంద్రుడు కలిసి మళ్లీ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు కొట్టేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది? హిమ మళ్లీ ఇంటికి చేరిందా? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.