English | Telugu

భారతీరాజా గారిది చాలా గొప్ప మనసు అన్న వేణు


స్వయంవరం మూవీతో హిట్ కొట్టిన హీరో వేణు తొట్టెంపూడి. టాలీవుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే ఐనా తన నటనతో ఆడియన్స్ మనసులో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మూవీలో కీరోల్ లో నటిస్తున్న వేణు ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా షోకి వచ్చాడు. స్వయంవరం మూవీ షూటింగ్ టైంలో తాను చాలా కొత్త యాక్టర్ నని వేణు అన్నారు. అదే టైంలో అలీతో పరిచయమయ్యింది అంటూ ఆయన గురించి కూడా చెప్పారు. సినిమాల నుంచి తాను నేర్చుకున్నది చాలా తక్కువని ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

స్పెషల్ రోల్స్ లో ఆడియన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలనే కోరిక వలన అలాంటి రోల్స్ కోసం చూస్తూ రీఎంట్రీకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో తన కోరిక తీరిందని చెప్పాడు. తాను ఇప్పటివరకు 25 చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. వేణు వాళ్ళ నాన్న గారు ప్రొఫెసర్ కావడంతో ఎప్పుడూ ఎదో ఊరు ప్రయాణం చేస్తూ ఉండాల్సి వచ్చేదని వివరించారు.

ఇక భారతిరాజా డైరెక్షన్ లో ఒక మూవీ మిస్ అయ్యానని చెప్పాడు వేణు. చెప్పాలంటే భారతి రాజా డైరెక్షన్లో రావాల్సిన మూవీనే తన ఫస్ట్ మూవీ కావాల్సింది కానీ ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాక సినిమా ఆగిపోయిందని భారతి రాజా వేణుకి చెప్పారు. వేణు యాక్షన్ నచ్చక షూటింగ్ ఆపేశారని అనుకున్న వేణు భారతి రాజా ముందు తనకు వచ్చిన అన్ని యాక్షన్ స్టిల్స్ ని చూపించారట. చివరికి షూటింగ్ వేరే కారణాల వలన ఆగిపోయిందని చెప్పి 500 రూపాయలు ఇచ్చి వెళ్లిపోయారని చెప్పాడు వేణు. తర్వాత చెన్నైలో జరిగిన తన పెళ్ళికి భారతి రాజా గారిని పిలిచానని ఆయన కూడా వచ్చి ఆశీర్వదించారని చెప్పాడు. భారతిరాజా లాంటి గొప్ప డైరెక్టర్ ఆధ్వర్యంలో సినిమా మిస్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అన్నాడు వేణు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.