English | Telugu
మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది...
Updated : Jul 1, 2023
ఢీ ప్రీమియర్ లీగ్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ ఐపోయింది. రాబోయే వారం నుంచి టీమ్స్ మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్టుగా ఉండబోతోంది అన్న విషయం ఈ ప్రోమో ద్వారా అర్ధమైపోతుంది. ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ సైరా రాయలసీమ టీమ్స్ మధ్య ముందుగా పోటీ మొదలయ్యింది. తర్వాత బెజవాడ టైగర్స్ వెర్సెస్ ఓరుగల్లు వీరులు టీమ్స్ మధ్య పోటీ కూడా అంతే రసవత్తరంగా సాగింది. ఇక ఈ షోకి బాలయ్య గెటప్ లో వచ్చిన హైపర్ ఆది ఒక అట్రాక్షన్ ఐతే ..యుట్యూబ్ లో ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ మూవీస్ లో నటిస్తూ ఫేమస్ ఐన సునయన ఈ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి ఆ అట్రాక్షన్ కి కొంచెం కామెడీ ఎమోషన్ టచ్ ఇచ్చి ఫన్ క్రియేట్ చేసింది.
బ్లాక్ డ్రెస్ విత్ పంచె కట్టు, నల్ల కళ్ళద్దాలతో నోట్లో చుట్టతో సెట్ లోకి వచ్చి కూర్చుని "కాపు కాసే కరీంనగరోళ్ళు , చుట్టూముట్టిన బెజావాడోళ్ళు, కమ్ముకొస్తున్న కర్నూలోళ్లు, కత్తిగట్టిన వరంగలోళ్లు ఎగేసుకోస్తాండారు" అంటూ బాలయ్య లెవెల్లో ఒక డైలాగ్ చెప్పాడు. ఇంతలో స్టేజి మీదకు సునయన దూసుకొచ్చి "ఎవడో సతాయిస్తున్నాడని అన్నావ్" అంటూ దీపికా పిల్లిని అడిగింది వెనక నుంచి ఆది వచ్చి "హలో" అనేసరికి సునయన సిగ్గుపడిపోయింది.. డ్రీమ్స్ లో "మాష్టారు మాష్టారు" సాంగ్ వేసుకునేసరికి "మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది" అన్నాడు ఆది "నాకు మాత్రం మిమ్మల్ని చూస్తేనే బతకాలనిపిస్తోంది" అంది "ప్రదీప్ నాకు ఆది ఎలాగైనా కావాలి" అని కన్నీళ్లు పెట్టుకొనేసరికి " ఈ సమాజం ఒప్పుకోదు" అనేసరికి సెట్ లో ఉన్న టీమ్స్ అంతా గట్టిగా అరిచారు ..దాంతో ఆది దిగి వచ్చి సునయనను తన గుండెల మీద తల ఆన్చుకుని ఓదార్చాడు...వెంటనే సునయన కన్నీళ్లు తుడుచుకుని "థాంక్యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ" అంది.. ఆ తర్వాత రీసెంట్ గా చనిపోయిన రాకేష్ మాష్టర్ ని ఈ స్టేజి మీద గుర్తు చేసుకున్నారు. ఒకప్పటి రాకేష్ మాష్టర్, శేఖర్ మాష్టర్ వీడియోని ప్లే చేసి చూపించారు. "మాష్టర్ తో ఏడెనిమిదేళ్ళ జర్నీ నాది..కానీ చాలామంది తెలిసీ తెలియక మాట్లాడుతుంటే మాత్రం చాలా బాధ కలుగుతోంది" అని కన్నీళ్లు పెట్టుకున్నారు శేఖర్ మాష్టర్.