English | Telugu

అలాంటి పెర్ఫార్మెన్స్‌కి ఇలాంటి కామెంట్సా.. శేఖర్‌ని నిలదీసిన పండు!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ నెక్స్ట్ వీక్ ప్రోమో చాలా అందంగా ముస్తాబై వచ్చింది. ఇందులో హైపర్ ఆది ఛత్రపతి మూవీలో ప్రభాస్ గెటప్ లో వచ్చి ఎంటర్టైన్ చేసాడు. "అసలు నువ్వు ప్రభాస్ అనడానికి ఒక సాక్ష్యం చూపించు" అని ప్రదీప్ ఫన్నీగా అడిగేసరికి "నా మెడలో గవ్వ చూసావా" అనేసరికి "గవ్వ పగిలిద్ది ఇంకోసారి" అని ప్రదీప్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. "ఈ సెట్ లో హగ్గులు ఏడ్చాము, ముద్దులకు ఏడ్చాము, మా కరువు హద్దులు దాటింది. శేఖర్ మాస్టర్ పొతే జానీ మాస్టర్ ఆయన పొతే గణేష్ మాస్టర్ ఇలా ఎవరైనా శ్రద్దా జోలికి వస్తే అని గొడ్డలిని టేబుల్ మీద కొట్టి తన ప్రతాపాన్ని చూపించాడు" ఆది.

ఆయన డైలాగ్ ని కంటిన్యూ చేయాల్సిన జెస్సి మాత్రం సైలెంట్ గా నిలబడేసరికి "అరేయ్ నీకు దణ్ణం పెడతాను నీ డైలాగ్ చెప్పారా" అంటూ బతిమాలేసరికి "నీ శ్రద్దా కాదురా...నా శ్రద్దా" అని చెప్పి నవ్వు తెప్పించాడు. తర్వాత ఒక డాన్స్ టీమ్ వచ్చి "నా పేరు సూర్య" మూవీలోని సాంగ్ కి డాన్స్ చేసింది. దానికి శేఖర్ మాస్టర్ "గైస్ యు కిల్డ్ ఇట్ " అని కామెంట్ చేసేసరికి పండు ఫైర్ అయ్యాడు. "మీరు ఎందుకు అలా కామెంట్స్ ఇస్తున్నారో నాకు తెలీదు..ఈ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇవ్వాల్సిన కామెంట్స్ అవి కాదు మాస్టర్" అనేసరికి సెట్ మొత్తం కూడా ఒక్కసారి షాకయ్యింది. దానికి శేఖర్ మాస్టర్ అస్సలు కోప్పడకుండా "సరే ఎలా కామెంట్ ఇవ్వాలో చెప్పు" అనేసరికి "హే జయజయ జై" ఇలా ఇవ్వాలంటూ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో శ్రద్దా సాంగ్ పాడి షాకిచ్చింది. "నిన్నేన నేను చూస్తోంది నిన్నేనా" అంటూ శ్రద్దా అచ్చ తెలుగులో హైపర్ ఆదిని ఉద్దేశించి చక్కగా సాంగ్ పాడి అందరినీ మెస్మోరైజ్ చేసింది. ఆది మాత్రం సిగ్గులమొగ్గయ్యాడు. "రియల్లీ ఐ లవ్ యు రా శ్రద్దా" అని ఆది చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.