English | Telugu

వసుధార గురించి ఆ విషయాన్ని బయటపెట్టిన దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-699లో.. న్యూస్ రిపోర్టర్స్ ఆ సస్పెండ్ అయిన ఇద్దరి టీచర్స్ తో మాట్లాడతారు. "మీరు కాలేజీలో చేసిన తప్పులన్నీ రిషి సర్ మా మీడియాలోని అందరికి పంపించాడు. రిషి సర్ పంపించాడు కాబట్టే నిజానిజాలు ఏంటో తెలుసుకున్నాం. లేకపోతే మీ మాటలు నమ్మితే నేను నవ్వులపాలు అయ్యేవాడిని. ఇంకెప్పుడు ఇలా చేయకండి" అని మీడియా పర్సన్ ఆ ఇద్దరు టీచర్స్ తో చెప్పేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం కొంచెం దూరంలో ఉన్న వసుధార, జగతి వింటారు. "మేడం రిషి సర్ ఇంత దూరం ఆలోచిస్తాడా? సర్ కి ఇంత ముందుచూపా" అని జగతిని అడుగుతుంది వసుధార. "రిషికి కాలేజీ మీద ఉన్న గౌరవం అలాంటిది. కాలేజీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు" అని జగతి అంటుంది.

మిషన్ ఎడ్యుకేషన్ గురించి జగతి ప్రెస్ మీట్ మొదలుపెడుతుంది. తర్వాత ఫణీంద్ర భూషన్ మాట్లాడతూ.. "ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుండి ప్రణాళిక చేసి, ఆచరణ చేసింది వసుధార" ఈ సందర్భంగా వసుధారని అభినందిస్తున్నాను" అని ఫణీంద్ర భూషన్ చెప్పి వసుధారని మాట్లాడమని చెప్తాడు. తనకంటే ముందే దేవయాని మాట్లాడానికి వస్తుంది. రిషిని వదిలిపెట్టి వెళ్ళిపో అని వసుధారతో అంటుంది దేవయాని. ఈ దేవయానిని తక్కువ అంచనా వేస్తున్నావ్.. వెళ్తావా? వెళ్ళవా? అని దేవయాని అనగా.. నేను వెళ్ళనని వసుధార చెప్తుంది. వసుధారని పొగుడుతూ స్పీచ్ మొదలుపెడుతుంది దేవయాని. "వసుధారని నా కోడలుగా చేసుకుందామని అనుకున్నాను.. కానీ తను ఎవరినో పెళ్ళి చేసుకొని వచ్చింది" అని దేవయాని అంటుంది. ఇది పర్సనల్ విషయాలు మాట్లాడే టైం కాదని వసుధార అంటుంది. అయితే నీ మెడలో ఉన్న ఆ తాళిని ఎవరు కట్టారు? నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకున్నావ్? అని దేవయాని అడుగగా.. వదినగారు ఏంటిది అని మహేంద్ర అంటాడు. మీరు ఆగండి నేను మాట్లాడుతున్నా అని దేవయాని అంటుంది. పదే పదే దేవయాని తాళి ఎవరు కట్టారని అడుగగా.. వసుధార మెడలో తాళికి రిషి కారణమని జగతి చెప్తుంది.

"నా కొడుకు రిషే వసుధార మెడలో తాళికి కారణం. వసుధార నా కోడలు" అని జగతి అందరికి చెప్తుంది. నీ శిష్యురాలిని కాపాడేందుకు రిషిని ఎందుకు వాడుకుంటున్నావ్ అని దేవయాని అడుగుతుంది. అప్పుడు అక్కడికి రిషి వస్తాడు. రిషిని చూసిన దేవయాని.. "విన్నావా రిషి.. ఆ వసుధార మెడలోని తాళికి కారణం నువ్వంట.. రిషి ఆగావేంటి.. అక్కడికి వచ్చి చెప్పు.. రా నాన్న" అని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి చెప్పమంటుంది. వసుధార మెడలో తాళికి నువ్వు కారణం కాదని చెప్పమని దేవయాని అంటుంది. రిషి నిజం చెప్తాడా? లేక వసుధారకి సపోర్ట్ చేస్తాడా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.