English | Telugu

నన్నెవరూ పెళ్లి చేసుకుంటారు అన్న దీప్తి!

సోషల్ మీడియాతో సెలబ్రిటీ అయ్యింది దీప్తి సునయన..డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కూడా మెరిసింది. ఈమె షన్నుతో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొన్ని రోజులు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. అలాంటి దీప్తి సునయన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. ప్రశ్నలు అడగమని చెప్పింది. ఒక నెటిజన్ ఐతే " పిచ్చిదానివి ఐపోతావ్ జాగ్రత్త అక్కో..నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్" అనేసరికి "ఎవరికీ లేదురా పిచ్చి" అనే సాంగ్ ని ఆ నెటిజన్ కోసం పోస్ట్ చేసింది. "మీరు ఇంట్రావర్ట్ ఆ లేదా ఎక్సట్రావెర్ట్ ఆ" అనేసరికి " నచ్చితే ఎక్సట్రావెర్ట్ ని, నచ్చకపోతే ఇంట్రావర్ట్" అని చెప్పింది. "నీ ఫ్రెండ్ పెళ్ళికి పోయావు మరి నీ పెళ్ళెప్పుడు దీపు" అని మరో నెటిజన్ అడిగేసరికి " నన్నెవరూ చేసుకుంటారు నాన్న ఎవడో ఒకడు ఉంటాడు" అని ఆన్సర్ ఇచ్చింది.

"నీకు తెలీదు కానీ నీకు ఒక ఇమాజినరీ వరల్డ్ ఉంది.. అందుకే నీలో నువ్వే మాట్లాడుకుంటావ్ అక్క " అని అడిగేసరికి " అంతేనా బ్రో...అంతే అంటావా.. మే బి అదే అయ్యుండొచ్చు. మీరు కూడా అప్పుడప్పుడు అలాగే మాట్లాడతారేమో ఎవరికీ తెల్సు" అంది సీరియస్ గా దీప్తి. ఇక దీప్తి ఎప్పుడూ రకరకాల వెరైటీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేస్తుండడం మనం చూసాం. లేటెస్ట్ వీడియోలో ఒక నెటిజన్ "నేను చనిపోయే లోపు నిన్ను షన్ను అన్నని ఒకే వీడియోలో చూడాలి" అని కామెంట్ చేసాడు. అలాగే రీసెంట్ గా ఒక పోస్ట్ లో ది డెవిల్ వేర్ హ్యూమిన్ అనే బ్రాండ్ కి చెందిన ఒక గ్రీన్ కొమ్ములున్న టీ షర్ట్ ని వేసుకుని మరీ ఫొటోస్ కి ఫోజులిచ్చింది. ఆ టీ షర్ట్ కాస్ట్ వచ్చి 6500 రూపాయలు... ఇక ఈ టీ షర్ట్ కాస్ట్ చూసి నెటిజన్స్ కూడా షాకయ్యారు. నీకే ఎందుకు ఇలాంటి డ్రెస్సులు దొరుకుతాయి అంటూ కామెంట్ కూడా చేశారు. దీప్తి నటించిన చిలక అనే ఆల్బం రేపు జనవరిలో రిలీజ్ కాబోతోందని కూడా చెప్పింది దీప్తి.