English | Telugu
Guppedantha Manasu:శైలేంద్రకి దిమ్మతిరిగే షాకిచ్చిన వసుధార!
Updated : Dec 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -953 లో.. ఎండీగా ఉండలేనని వసుధార బోర్డు మెంబెర్స్ కి చెప్తుంది.. వసుధార ఏం చేస్తున్నావ్ నిన్ను ఎవరో బయపెట్టి ఇలా చేయిస్తున్నారు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవద్దని మహేంద్ర అమగానే.. ఈ నిర్ణయం సరైనదేనని వసుధార చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త ఎండీ గా ఎవరు ఉంటారని బోర్డు మెంబర్స్ అడుగుతారు.
ఇంకెవరు శైలేంద్ర భూషన్ అని వసుధార అనగానే.. మహేంద్ర అనుపమ ఇద్దరు కోపంగా చూస్తారు. దేవయాని, శైలేంద్ర ఇద్దరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరు సంతకలు చేస్తే శైలేంద్ర ఎండీగా ఛార్జ్ తీసుకుంటారని బోర్డు మెంబర్స్ అంటారు. సరే ఇప్పుడు దానికి కావాలిసిన పేపర్స్ తీసుకోని వస్తానని వసుధార వెళ్తుంది. వసు వెళ్లి ఎండీ చైర్ దగ్గరికి వెళ్లి బాధపడుతుంటే మహేంద్ర, అనుపమ ఇద్దరు వచ్చి.. ఎందుకిలా చేస్తున్నావని అడుగుతారు. నా కారణాలు నాకు ఉంటాయని వసుధార చెప్తుంది. మరొక వైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. తన కొడుకుని చూసి అనుకున్నది సాధించావంటు దేవయాని మురిసిపోతుంది. మరొకవైపు మళ్ళీ మీటింగ్ మొదలు అవుతుంది. శైలేంద్ర ఎండీగా అందరూ బోర్డు మెంబర్స్ సంతకం పెడుతారు. వసుధార సంతకం పెట్టబోతు ఆగిపోతుంది. ఏమైందని దేవయాని అడుగుతుంది. రిషి సర్ వచ్చాక రిషి సర్ ముందు శైలేంద్ర ఎండీ అయితే బాగుంటుంది. ఇందాక అతనే అన్నాడు కదా.. ఈ టైమ్ లో రిషి ఉంటే బాగుండేదని అందుకే రిషి సర్ వచ్చాక ఎండీగా బాధ్యతలు అప్పగిస్తానని వసు చెప్పగానే బోర్డు మెంబర్స్ కూడా సరే అంటారు.
అ తర్వాత కాసేపటికి వసుధర ఇలా చేసిందేంటని వసుధార దగ్గరికి శైలేంద్ర వెళ్లి.. నువ్వు చెప్పిందేంటి? చేసిందేంటని అడుగుతాడు. రిషి నీకు అవసరం లేదా అని శైలేంద్ర అంటాడు. మీరు రిషి సర్ ని తీసుకోని రండి. అ తర్వాత మీరు చెప్పింది చేస్తానని వసుధార అంటుంది. రిషి సర్ కి ఏమైనా అయితే మీకు మాములుగా ఉండదు. ఈ బ్రాస్ లైట్ పంపించారు. అంతే కాకుండా సాక్ష్యం కూడా ఉందని వసుధారని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసిన వీడియోని చూపించగానే శైలేంద్ర షాక్ అవుతాడు. ఈ వీడియో ఎక్కడదని శైలేంద్ర అడుగుతాడు. వసుధార కంగారుగా శైలేంద్ర చెప్పిన అడ్రస్ కి వెళ్తుంటే డౌట్ వచ్చి అనుపమనే ఫాలో అయి వసుధారని శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేస్తున్నది వీడియో తీస్తుంది. అ వీడియోని వసుధార మీటింగ్ నుండి పేపర్స్ కోసం బయటకు వచ్చినప్పుడు అనుపమ చూపిస్తుంది. అందుకే వసుధార సంతకం చెయ్యకుండా ఆగుతుంది. అదే విషయం వసుధార గుర్తుకు చేసుకుంటుంది. కానీ అనుపమ తీసినట్లు చెప్పదు. రిషిని చంపేస్తానని శైలేంద్ర అనగానే.. శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తుంది వసుధార. రిషి సర్ మీ దగ్గర ఉన్నాడని అందరికి చెప్తాను. ఈ వీడియో చూపిస్తాను. రెండు, మూడు రోజుల్లో రిషి సర్ ని తీసుకోని రావాలని శైలేంద్రకి వసుధార మాస్ వార్నింగ్ ఇస్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.