English | Telugu

నవంబర్ 20 నుంచి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5

ఆహా ఓటిటిలో ఇండియన్ ఐడల్ షో పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే - సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్ తో నవంబర్ 20 వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఐతే అది కాస్తా బ్లర్ చేసి వేశారు. ఐతే అందులో ఎవరు ఉన్నారు అనే విషయం లైట్ కనిపిస్తూ ఉంది కానీ అసలు అందులో పార్టిసిపంట్స్ ఎవరన్నది ఇంకా పూర్తిగా తెలీదు. ఐతే మానస్, అఖిల్ సార్ధక, యాదమ్మ రాజు, కావ్యశ్రీ, ప్రేరణ, టేస్టీ తేజ, పంచ్ ప్రసాద్, యాష్మి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆహా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.

ఇక నెటిజన్స్ అంతా కూడా కావ్య - ప్రేరణ కాంబో సూపర్ గా ఉంటుంది, యాష్మి కోసం వెయిటింగ్ ఇక్కడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే హోస్ట్ ఎవరు అన్నది మాత్రం తెలియడం లేదు. అఖిల్ సార్థక్, మానస్ జోడి ఈ ప్రోగ్రాంని హోస్ట్ చేస్తారని నెటిజన్స్ కామెంట్స్ బట్టి తెలుస్తోంది. ఐతే గత సీజన్ చూసుకుంటే సుమ హోస్ట్ చేయగా నటుడు, చెఫ్ ఐన జీవన్ కుమార్ వంటలు టేస్ట్ చూసి మార్క్స్ ఇచ్చారు. ఇక జోడీస్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్, యాదమ్మ రాజు - సుప్రీతా, దీపికా రంగరాజు - సమీరా భరద్వాజ్, ప్రష్షు బేబీ - ధరణి, ప్రసాద్ బెహరా - విరాజిత వీళ్లంతా కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా అమర్ దీప్ - అంబటి అర్జున్ జోడి నిలిచింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.