Read more!

English | Telugu

మానస్ గురించి దీపిక కామెంట్స్.. డైరెక్టరే తన ఎనర్జీ అంట!

దీపిక రంగరాజు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ బ్రహ్మముడి కావ్య అని అంటే అందరు ఇట్టే గుర్తుపడతారు. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఇంట్లో ఒక అమ్మాయిలా మారిపోయింది దీపిక‌ అలియాస్ కావ్య. తెలుగు అమ్మాయి కాకపోయిన తెలుగుతనం ఉట్టి పడేలా ఉంటుంది కావ్య. 'బ్రహ్మముడి' లో పాపులర్ ఉన్న పాత్ర కావ్యది. తన రీల్ లైఫ్ లో ఎలా పద్దతి గా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అంతే పద్ధతిగా అణుకువగా ఉంటుంది దీపిక.

బ్రహ్మముడి సీరియల్ లో కావ్య -రాజ్ ల జంట బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది. కావ్య ఒకవైపు అత్తింటి గౌరవం, మరొకవైపు పుట్టింటి బరువు, భాద్యతలు చేపడుతూ అందరికి చేరువవుతుంది. మొదట రాజ్ కి ఇష్టం లేకుండా కావ్యని పెళ్ళి చేసుకుంటాడు రాజ్. అయితే ఇప్పుడిప్పుడే కావ్యకి దగ్గరవుతున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో అనామికకి లవ్ ప్రపోక్ చేయమని కళ్యాణ్ కి చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసింది కావ్య.

వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చి కృష్ణమూర్తి పరువు కాపాడాడు రాజ్. ఇక అప్పు తన మనసులో కళ్యాణ్ మీద ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టట్లేదు. ఇలాంటి టైమ్ లో స్వప్న ప్రెగ్నెంట్ అని మర్చిపోయి డ్యాన్స్ చేస్తే తనకి బుద్ది చెప్పింది కావ్య. అయితే రాజ్ రాసిన చీటీని చదివిన కావ్య ఆశ్చర్యపోతుంది. ఇలాంటి ట్విస్ట్ లతో ఈ సీరియల్ ఫుల్ ఎంగేజ్ అవుతుంది. అయితే ఇందులో కావ్య ప్రధాన పాత్రలో దీపిక ఆకట్టుకుంటుంది.

కొన్ని నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది దీపిక అలియాస్ కావ్య. రోజుకొక సర్ ప్రైజ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో‌ కూడా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తను 'ఆస్క్ మి సంథింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది దీపిక. మీరు పుట్టింది ఎక్కడ అని ఒకరు అడుగగా.. చెన్నైలోని టీనగర్ అని చెప్పింది దీపిక. మీరు తమిళ్ అయిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు ఎలా అని ఒకరు అడుగగా.. నా బ్లడ్ లోనే తెలుగు ఉంది అని దీపిక అంది. మీ ఫేవరెట్ నటీనటులు ఎవరని అడుగగా..

బ్రహ్మముడి సీరియల్ లోని కావ్య-రాజ్ అని దీపిక అంది. మానస్ గురించి చెప్పండి అనగా.. మానస్ గారు జెమ్, ఇంటలిజెంట్ అండ్ వెరీ సపోర్టివ్ అని అంది. డైరెక్టర్ కుమార్ పంతం గురించి చెప్పండి అని ఒకరు అడుగగా.. అతనే నా బూస్ట్. పొద్దున్నే షూట్ కి వచ్చిననుండి అయిపోయేవరకు వెరీ యాక్టివ్, పుల్ ఎనర్జీ ఇస్తాడు. ఇంక చాలా వరకు అందరికి సపోర్ట్ గా ఉంటాడు. అతను ఒక పెద్ద పవర్ స్టేషన్ అని దీపిక అంది. ఇలా  దీపిక తన ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా కొన్ని విషయాలని పంచుకుంది.