English | Telugu
ఏదైనా అన్నప్పుడు తీసుకోవాలి: శ్రీహాన్
Updated : Dec 8, 2022
బిగ్ బాస్ లో రోజు రోజుకి కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు పెద్దగా మారుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్.. ఇప్పుడు విడిపోతున్నట్టుగా గొడవలు మొదలయ్యాయి. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్లో అవి కాస్త పెరిగి ఒకరినొకరు మాటా మాటా అనుకునేంతలా అయ్యాయి.
అయితే కిచెన్ లో అందరు హౌస్ మేట్స్ ఏదో ఒక పని చేస్తూ ఉండగా, రేవంత్ తన పని తాను చేసుకుంటుండగా "అరేయ్ మామ, అది అలా కాదు రా, ఇలా చేయాలి" అని శ్రీహాన్ చెప్పగా "మామా నాకు ఎలా చేయాలో తెలుసు" అని రేవంత్ కోపగించుకున్నాడు. దాంతో శ్రీహాన్ కి కూడా ఒక్కసారిగా కోపం పెరిగిపోయింది.
"అన్నింట్లో బొక్కలు వెతికితే నా వల్ల కాదు. ఏదో ఒక మాట చెబితే వినరు. చాలా సార్లు గమనించా. అసలు చెప్పింది విననే వినరు. చెప్పిన వెంటనే ఏదో ఒకటి కరెక్షన్ చెప్తారు. ఎలా ఉంటుంది చెప్పు" అని రేవంత్ అనగా "అన్నది ఒప్పుకోవడానికి ఏంటి. అది ఏ రకంగా నెగెటివ్ అవుతుంది చెప్పు. ఏదైనా అన్నప్పుడు తీసుకోవాలి. తీసుకోగలగాలి అది విన్నర్ కి ఉండే లక్షణం" అని శ్రీహాన్ చెప్పాడు. ఆ తర్వాత "మీకో దండంరా బాబు" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రేవంత్. ఇలా వీరి మధ్య ఈ రెండు మూడు రోజులుగా చిన్నగా గొడవలు సాగుతూ వస్తుండటంతో.. హౌస్ లో ఒకరి మీద ఒకరికి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.