English | Telugu

మొట్టమొదటి సారిగా ఏడ్చిన మెరీనా-రోహిత్ జంట!

బిగ్ బాస్ ఈ వారం కంటెస్టెంట్స్ లో జోష్ ని నింపడానికి, ఒక వినూత్నమైన రీతిలో కెప్టెన్సీ టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు, ఆడియో రూపంలో వినిపిస్తూ గానీ, వీడియో రూపంలో కనిపిస్తూ గానీ, గిఫ్ట్ లు, ఫోటో ఫ్రేమ్స్ రూపంలో గానీ.. హౌస్ లో కంటెస్టెంట్స్ కి కనువిందు చేస్తూ, వాళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపాలి. ఈ టాస్క్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

అయితే కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఊరకనే ఏం ఇవ్వలేదు. తర్వాత కంటెస్టెంట్స్ కి టాస్క్ నియమాలు చెబుతూ, "బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ గా ఉండాలి. ఒక్కొక్కరుగా వచ్చి కొంత మేరకు ఛార్జ్ ఉపయోగించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి. అయితే ఛార్జింగ్ కూడా వంద శాతం ఉంటేనే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాగా వంద శాతం కావడానికి కూడా కొందరు హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చెయ్యాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, అందరు ఆలోచనలో పడ్డారు.

"ఆదిత్య సీజన్ మొత్తం సిగరెట్ తాగకూడదు. అలాగే రోహిత్, వాసంతి ఇద్దరిలో ఎవరో ఒకరు వరుసగా రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ కావాలి" అని బిగ్ బాస్ చెప్పడంతో, రోహిత్ సెల్ఫ్ నామినేట్ అవుతానని ఒప్పుకొన్నాడు. దాంతో బ్యాటరీ ఛార్జ్ వంద శాతానికి చేరుకుంది. దీంతో చివరగా మిగతా ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం రావడానికి కారణం అయిన రోహిత్ కి మాత్రం ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 'కనీసం మీరు కాల్ మాట్లాడతారా?' అని ఎవరూ అడుగలేదని రోహిత్ బాధతో ఏడ్చాడు. దీంతో మొట్టమొదటిసారిగా రోహిత్ ఏడ్వడం హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు చూసారు. మెరీనా కూడా బాధపడుతూ రోహిత్ ని ఓదార్చింది.

ఆ తర్వాత హౌస్ మేట్స్ కి కొత్త టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్ అయ్యే అవకాశం అందరికి సమానంగా ఇచ్చాడు. బాల్స్ ని బాస్కెట్ లో ఎవరు ముందుగా పడేస్తారో వారు కెప్టెన్సీ పోటీకి అర్హత సాధిస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఆ టాస్క్ లో మెరీనా-రోహిత్ ఇద్దరు బాగా ప్రయత్నించారు కానీ ఓడిపోయారు.

తర్వాత మెరీనా రోహిత్ హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. 'ఇద్దరం బాగా కష్టపడ్డాం, కానీ ఎవరూ మనకి సపోర్ట్ చేయలేదు' అంటూ ఇద్దరు భావోద్వేగానికి లోనై ఒకరినొకరు ఓదార్చుకున్నారు. "హౌస్ మేట్స్ కోసంనువ్వు ఎంతో త్యాగం చేసావ్. ఐనాకనీసం విలువ కూడా నీకు లేదు" అని మెరీనా చెప్పగా, రోహిత్ బాధపడ్డాడు. అయితే డీసెంట్ గా, ఫేర్ గేమ్ ఆడే రోహిత్ కెప్టెన్ అవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాగా ఈ వారం కెప్టెన్ గా ఎవరు ఎంపిక అవుతారో తెలియాల్సి ఉంది‌.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.