English | Telugu
Brahmamudi : అపర్ణకి దగ్గరైన తన మనవడు.. రేవతిని పుట్టినరోజుకి రమ్మన్నదిగా!
Updated : Jul 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -780 లో..... శ్రీను కోర్ట్ కి వచ్చి తప్పు ఒప్పుకోవడంతో అప్పు కేసు నుండి బయటపడుతుంది. థాంక్స్ బావా.. నీ వల్లే ఇదంతా అని రాజ్ తో అప్పు అంటుంది. అందరు చెప్తున్నారు కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పడం లేదని కావ్యకి ఉద్దేశించి రాజ్ అంటాడు. ఆ తర్వాత యామిని వచ్చి బావ చాలా బాగా చేసావని రాజ్ ని మెచ్చుకుంటుంది. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు.. కేసు నుండి కాపాడగలిగాను కానీ అసలు దీని వెనకాల ఎవరున్నారని తెలుసుకోలేకపోయానని రాజ్ అనగానే యామిని టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటారు. ఇక జాబ్ కి రీజైన్ చెయ్యి అని అప్పుతో ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు కేసు నుండి బయటపడింది కదా అని రాజ్ అంటాడు. ఇప్పుడు బయటపడింది కానీ ఫ్యూచర్ లో ఇలాంటివి రావని గ్యారంటీ ఏంటని ధాన్యలక్ష్మి అనగానే... రాజ్ తన మాటలతో ధాన్యలక్ష్మిని కన్విన్స్ చేస్తాడు. మరొకవైపు యామినిని రుద్రాణి కలిసి మాట్లాడతుంది. రుద్రాణి, రాహుల్, యామిని ఇంటి నుండి వెళ్తుంటే అక్కడ రేవతి భర్త జగదీశ్ కనిపిస్తాడు. జగదీష్ కదా అని అతన్ని ఫాలో అవుదామని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి.
మరొకవైపు రేవతి వాళ్ళ బాబు స్వరాజ్ అపర్ణకి ఎదరుపడతాడు. అపర్ణ ఆ బాబు మాటలకి మురిసిపోతుంది. అప్పడే అపర్ణతో స్వరాజ్ మాట్లాడడం రేవతి చూసి షాక్ అవుతుంది. వెంటనే జగదీశ్ కి ఫోన్ చేసి రమ్మంటుంది. తరువాయి భాగంలో స్వప్న పాప పుట్టినరోజుకి మొన్న మమ్మల్ని ఒకావిడ కాపాడింది తనని కూడా పిలవాలని కావ్య అనగానే సరే అని రేవతికి అపర్ణ ఫోన్ చేసి.. నా మానవరాలు పుట్టినరోజుకి రండి అని చెప్తుంది. అదంతా రుద్రాణి విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.