English | Telugu

Brahmamudi : బుల్లితెరని హీటెక్కించేసిన రొమాన్స్.. పాత బంగ్లాలో శోభనం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -468 లో.. రాజ్, కావ్య రెస్టారెంట్ కి వెళ్తారు. కావ్యని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి.. రాజ్ ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు. చెప్పిందంతా గుర్తుంది కదా.. కేక్ టైమ్‌కి రావాలి. ఆ తర్వాత ఫుడ్.. తేడా రాకూడదని రాజ్ అంటాడు. సరే సర్ మీకెందుకు సర్.. మొత్తం నేను చూసుకుంటాను కదా.. మీరు వెళ్లండి కూర్చోండని అతను అంటాడు. అదే డైలాగ్ వాడతాడు రాజ్ జాగ్రత్తలు చెప్పిన ప్రతిసారీ. దాంతో రాజ్ కోపంగా.. హేయ్.. నాకెందుకు అంటావేంటయ్యా.. నాకే కావాలి.. నువ్వు సరిగ్గా చూసుకో.. సరే వెళ్తున్నానని కావ్య దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు రాజ్.

ఇక కాసేపటికి మేనేజర్.. హలో ఆల్.. ఈ రోజు మన హోటల్‌కి ప్రముఖ అతిథి దుగ్గిరాల వారసుడు విచ్చేశారంటూ రాజ్ గురించి.. పొగిడి.. కేక్ పంపిస్తాడ. ఆ కేక్ వస్తున్నంత సేపు.. అన్నా చెల్లెల అనుంబంధం అంటూ పాట వస్తుంది. ఆ పాట విని రాజ్, కావ్య బిత్తరపోతారు. హ్యాపీ బర్త్ డే సిస్టర్ అని కేక్ మీద ఉంటుంది. ఇంతలో పక్క టేబుల్ వ్యక్తి.. అది నేను ఆర్డర్ చేశాను కదయ్యా అని మేనేజర్ తో అనగానే.. సారీ రాజ్ సర్.. పొరబాటు పడ్డాం.. ఈ సారి మాత్రం మీదే పక్కా మొత్తం నేను చూసుకుంటానంటు మేనేజర్ కవర్ చేసి వెళ్తాడు. ఇక రాజ్ అవన్నీ వద్దని ఫుడ్ పంపించమని చెప్తాడు.‌ ఇక ఇద్దరు ఫుడ్ తినేసి కారులో వస్తుంటారు. ఇంతలో సడన్ గా వర్షం పడుతుంది. ఇక పక్కనే ఉన్న ఓ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ క్యాండిల్స్ తో రాజ్ ముందుగానే డెకరేట్ చేసి ఉంచుతాడు. ఇక అక్కడో ఓ చీర ఉండగా దానిని మార్చుకోమని కావ్యకి రాజ్ చెప్తాడు.‌ ఇక అదే సమయంలో వెలుగులో నుండి ఎవరో వెళ్ళినట్టు కావ్యకి అనిపించగా భయపడుతుంది. ఎవరు లేరని రాజ్ అన్నాక చీర మార్చుకుంటుంది కావ్య.

మళ్ళీ భయపడిన కావ్య వెంటనే రాజ్ దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది. అప్పుడే రొమాంటిక్‌గా కావ్యను కిస్ చేస్తాడు రాజ్. కాసేపటికి మధురమే ఈ క్షణమే సాంగ్ ఓ వైపు..రాజ్ , కావ్యల రొమాన్స్ మరోవైపు.. స్క్రీన్‌ని హీటెక్కిస్తాయి. ఆ సమయంలో ఇద్దరూ సిగ్గు పడటం.. దూరం జరగడం.. మళ్లీ ఏకం కావడం.. లిప్ కిస్ చేసుకోవడం.. అంతా చూపిస్తారు. వారి తొలికలయిక జరిగినట్లుగా స్క్రీన్ మీద చూపిస్తారు. దుప్పటి కప్పుకుని ఇద్దరూ ఏకం కావడంతో శోభనం అయిపోయిందన్న క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.