English | Telugu

Brahmamudi : నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -511 లో.. కళ్యాణ్ హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదురా.. రేపు మనతో మాట్లాడుతుందని రాజ్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. నాకు అన్నయ్యని చూస్తుంటే భయమేస్తుంది. మీరు అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి పెద్దనాన్న.. నేను పెద్దమ్మ దగ్గర ఉంటానని కళ్యాణ్ అంటాడు. వాడిప్పుడు వచ్చే సిచువేషన్ లో లేడని సుభాష్ అంటాడు. అన్నయ్య పెద్దనాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు.. తనకి టెన్షన్ గా ఉందట.. పెద్దమ్మ గురించి కాదు పెద్దనాన్న గురించి కూడా ఆలోచించమని రాజ్ తో కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇక్కడే ఉండు డాడ్ ని దింపేసి వస్తానని అంటాడు.

మరొకవైపు అందరు ఇంట్లో అపర్ణ గురించి బాధపడుతుంటారు. రుద్రాణి, రాహుల్ లు ఇదే కరెక్ట్ టైమ్.. ఇప్పుడే కావ్యని అందరి దృష్టిలో బ్యాడ్ చెయ్యాలని రాహుల్ అంటాడు. చేస్తాను రాజ్ చేతే కావ్యని గెంటేలా చేస్తానని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్, సుభాష్ లు ఇంటికి వస్తారు. అపర్ణ ఎలా ఉందని ఇందిరాదేవి అడుగుతుంది . చూసారా కదా అంటు రాజ్ కోప్పడతాడు. ఎవరినో నమ్మి తప్పు చేసానని రాజ్ అనగానే.‌. తప్పు నువ్వు చెయ్యలేదు. ఈ కావ్య చేసిందంటు రాజ్ ని రెచ్చగొట్టేలా రుద్రాణి మాట్లాడుతుంది. రుద్రాణి గారు టైమ్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాకండి అని కావ్య అంటుంది. అందరికి మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావ్.. అసలు అపర్ణని వదిలి ఎక్కడికి వెళ్ళావని ఇందిరాదేవి అడుగుతుంది. ఎవరో ఒకతను కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది. అది కూడా రాహుల్ చేస్తున్నాడు.. మీరు రాకపోతే కంపెనీ పరువు పోతుందన్నారు.. అందుకే వెళ్ళాను.. అత్తయ్య గారు వెళ్ళమంటేనే వెళ్ళానని కావ్య అంటుంది.

కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది. అది ఫేక్ కాల్ అని కావ్య చెప్తుంది. ఎంత బాగా కథ అల్లావని రుద్రాణి అంటుంది. రుద్రాణికి కావ్య సమాధానం చెప్తుంటే షటప్ అని రాజ్ కావ్యపైకి అరుస్తాడు. నీకెందుకు కంపెనీ? ఏం అయితే నీకెందుకంటూ కావ్యపై రాజ్ విరుచుకుపడతాడు. నువ్వు తప్పు చేసావ్.. నీ తప్పు వల్ల మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం.. నిన్ను జీవితంలో మాత్రం క్షమించనని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.