English | Telugu

Kirrak seetha : ప్రేరణ నోరు మూయించిన కిర్రాక్ సీత!


బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ నామినేషన్ ఇంకా పూర్తి కాలేదు. నిన్నటి ఎపిసోడ్ లో సగమే చూపించగా.. నేడు సెకెండ్ డే నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఇక రెండో రోజు కూడా ఈ నామినేషన్స్ హీట్ కొనసాగుతుంది.

మణికంఠను పృథ్వీ నామినేట్ చేశాడు. నిఖిల్ టీమ్ లో ఉంటూ.. నైనికతో తన టీమ్ లో చేర్చుకోమని అడగడం.. గోతులు తవ్వుతున్నట్టుగా అనిపించిందని మణికంఠని పృథ్వీ నామినేట్ చేశాడు. ఆ తర్వాత నిఖిల్‌ని ప్రేరణ నామినేట్ చేసింది. ప్రతిదానికి డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటావేంటి.. చిన్నదాన్ని పెద్దది చేస్తావేంటని ప్రేరణ అడుగగా.. మొన్న మీ టవల్‌ని పొరపాటుగా ఆదిత్య అన్న వాడుకున్నాడు. దానికి సారీ కూడా చెప్పాడు.. కానీ దాన్ని నువ్వు రచ్చ రచ్చ చేసి బిగ్ బాస్‌కి కంప్లైంట్ ఇచ్చావు.. కొత్త టవల్ తెప్పించుకున్నావు.. నువ్వు కూడా రచ్చ చేయకుండా ఆ టవల్‌ని ఉతుక్కుని వాడుకోలేకపోయారా.. మీకు ఇది పెద్ద ఇష్యూ అనిపించింది.. నాకు ఆ డస్ట్ బిన్ ఇష్యూ పెద్దగా అనిపించిందని కిర్రాక్ సీత అనేసరికి ప్రేరణకి నోట మాట రాలేదనే చెప్పాలి.

వందమంది నా ముందుకొచ్చి ఇది తప్పు అని చెప్తే.. నాకు అది రైట్ అనిపిస్తే అది రైటే అని చెప్తానంటు సీత స్ట్రాంగ్ గా చెప్పేసింది. ఇక నిఖిల్ ని నబీల్ ఆఫ్రీది నామినేట్ చేసాడు. ఛీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ నబీల్ నామినేట్ చేయగా.. నేను ఎంత చీఫ్ అయినా వాళ్ల పర్సనల్స్ వాళ్లకి ఉంటాయి. ఈరోజు సోనియాతో వచ్చింది.. రేపు ఇంకొకరితో వస్తుంది.. ఐ డోన్ట్ కేర్ అని నిఖిల్ అన్నాడు. ఈ ప్రోమోని బట్టి చూస్తే ఈ వారం మొత్తం ఏడుగురు దాకా నామినేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రోమో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...