English | Telugu

Brahmamudi : అనామిక చేష్టలకు రగిలిపోతున్న కళ్యాణ్ .. ఇదంతా ఆవిడ ప్లానే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -448 లో....నేనే మీడియా పిలిచి భాగోతం బయటపడేలా చేశానని అనామిక ఒప్పుకుంటుంది. దాంతో ధాన్యలక్ష్మి తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా అత్తగా భరించాను కానీ ఇప్పుడు నువ్వు నా కొడుకు పరువు తీసావని అనామికపై ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. ఇక్కడ అందరు కోపంగా ఉన్నారు.. నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్లడం మంచిదని అనామికతో సుభాష్ అనగానే తను లోపలికి వెళ్తుంది. అనామిక కేవలం నా ఆస్తులు చూసి పెళ్లి చేసుకుంది.. అందుకే ఆఫీస్ కి వెళ్ళమంది.. వెళ్ళనంటే ఇలా నిందలు వేస్తుంది. కానీ నేను తనతో కలిసి ఉండలేను విడాకులు ఇస్తానని కళ్యాణ్ అంటాడు.

ఆ తర్వాత కళ్యాణ్ గురించి రాజ్ ఆలోచిస్తుంటే.. అప్పుడే కావ్య వస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఇది ఎవరు ఆపలేరా అని కావ్య అంటుంది. మీరు కూడా సైలెంట్ గా వచ్చారని కావ్య అడుగుతుంది. ఏం చేయమంటావ్ మరి వాడి భావకత్వపు ప్రపంచంలో వాడి మనసు సున్నితం.. ఇప్పుడు ఈ మాటలు నిందలు తట్టుకోలేక పోతున్నాడని రాజ్ అంటాడు. నీ చెల్లిపై అన్ని నిందలు వేసిన సైలెంట్ గా ఉన్నావ్.. అనామికని ఒక్క మాట కూడా అనట్లేదని కావ్య గురించి రాజ్ గొప్పగా మాట్లాడుతాడు. వాళ్ళని మనమే ఒకటి చెయ్యాలి.. వాళ్ళతో మాట్లాడాలని కావ్య అనగానే.. రాజ్ సరే అంటాడు. మరుసటి రోజు అనామిక ఒంటరిగా ఉంది.. తన దగ్గరికి వెళ్లి ఇంకాస్త రెచ్చగొట్టాలని రుద్రాణి అనుకుంటుంది. అప్పుడే అనామిక దగ్గరికి రాజ్ వచ్చి.. నువ్వు కళ్యాణ్ ని తప్పుగా అర్థం చేసుకుంటూన్నావ్.. వాడితో మనసు విప్పి మాట్లాడు.. వాడేంటో అర్థమవుతుంది.. అనవసరంగా మీరు గొడవలకి దిగి దూరం పెంచుకోవద్దని రాజ్ చేప్తాడు. దాంతో చాటుగా ఆ మాటలు విన్న రుద్రాణి.. రాజ్ మాటలకు అనామిక కరిగిపోయి వాళ్ళిద్దరు ఒకటి అవుతారా ఏంటి.. ఇంత చేసి వెస్ట్ అవుతుందని అనుకుంటుంది. వెంటనే అనామిక దగ్గరికి వచ్చి కళ్యాణ్ విడాకులు ఇచ్చేలా ఉన్నాడు.. మీ అమ్మనాన్నలని పిలిపించి అడిగించమని రుద్రాణి అనగానే.. సరేనని అనామిక అంటుంది.

ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కావ్య మాట్లాడుతుంది. పదా కిందకి వెళదామని తీసుకొని వెళ్తుంది. ఇంట్లో ఉన్నా గొడవల వాళ్ళ మీ ఆరోగ్యం ఏమవుతుందోనని టెన్షన్ అవుతుంది. అందుకే ఈ గొడవలు ఉండద్దు అనుకుంటున్న పెద్దమ్మ అని కళ్యాణ్ అనగానే.. అంటే నాకు విడాకులు ఇస్తావా అని అనామిక అడుగుతుంది. నువ్వు నా చెల్లివి అయితే ఆ చెంప ఈ చెంప వాయించే దాన్ని అని కావ్య అంటుంది. నీ చెల్లి నాలా ఎందుకు ఉంటుంది. పెళ్లి అయిన మగాడితో బాలాదూర్ తిరుగుతుంటుందని అనామిక అనగానే.. కళ్యాణ్ తనపై చెయ్యి ఎత్తుతాడు. తరువాయి భాగంలో అనామిక పేరెంట్స్ వస్తారు. అందరి ముందు ప్రకాష్ అపర్ణలని చులకనగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.